రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోకపోవడంతో సౌతాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఇక వన్డేల్లో టీమిండియాకు 26వ కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించనున్నాడు.
చదవండి: 'ఫుల్‌టైం టెస్టు కెప్టెన్'.. పెద్ద బాధ్యత మీద పడ్డట్టే
ఇదే సమయంలో సౌతాఫ్రికా గడ్డపై డెబ్యూ కెప్టెన్సీ చేయనున్న తొలి ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలవనున్నాడు. ఇంతకముందు శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు విదేశీ గడ్డపై డెబ్యూ కెప్టెన్సీ చేశారు. డెబ్యూ వన్డే కెప్టెన్సీలో ఇద్దరూ సిరీస్ విజయాలు అందుకున్నారు. తాజాగా రాహుల్ ప్రొటీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను గెలిస్తే రహానే, ధావన్‌ల సరసన నిలవనున్నాడు.
అంతకముందు సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో కోహ్లి గైర్హాజరీలో రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలయింది. ఆ తర్వాత కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ పరాజయం పాలైన టీమిండియా 1-2 తేడాతో దక్షిణాఫ్రికాకు సిరీస్‌ను కోల్పోయింది. సిరీస్ ఓటమి అనంతరం కోహ్లి టీమిండియా టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడం వైరల్‌గా మారింది.
చదవండి: ఏడేళ్ల తర్వాత తొలిసారి ఇలా.. అయినా అందరి చూపు అతనివైపే..!
Comments
Please login to add a commentAdd a comment