సౌతాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు కేఎల్ రాహుల్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయంతో సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్ స్థానంలో రాహుల్ నాయకత్వ బాధ్యతలు నిర్వహించనున్నాడు. బుధవారం తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు. ప్రొటిస్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికి.. కేఎల్ రాహుల్, పంత్, బుమ్రా లాంటి ఆటగాళ్లు కూడా పరిశీలనలో ఉన్నారు.
చదవండి: రాహుల్‌తో పాటు ఆసీస్ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడికి 15 కోట్లు!
చిట్‌చాట్‌లో భాగంగా టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం మీకు వస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న రాహుల్‌కు ఎదురైంది. దీనిపై రాహుల్ వివరణ ఇస్తూ.. '' కోహ్లి టెస్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకునేవరకు మాకు ఎలాంటి ఆలోచన లేదు. కానీ కోహ్లి ఎప్పుడైతే నాయకత్వం నుంచి తప్పుకున్నాడో అప్పుడు వివిధ రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. రోహిత్‌ను కాదని నన్ను టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేస్తే అది నాకు పెద్ద బాధ్యత అవుతుంది. ఎందుకంటే క్రికెట్‌లో కెప్టెన్‌గా దేశాన్ని నడిపించడం ఎవరికైనా ప్రత్యేకమే... నాకు ఎలాంటి మినహాయింపు ఉండదు. టెస్టు కెప్టెన్‌గా అవకాశం వస్తే నా మీద పెద్ద బాధ్యత ఉన్నట్లుగా ఫీలవుతా.
ప్రస్తుతానికైతే రోహిత్ ఉన్నాడు కాబట్టి నాకు ఆ ఆలోచనలు లేవు. వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే మంచి బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతా. ఇక సౌతాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు కోహ్లి భయ్యా దూరంగా ఉండడంతో తొలిసారి కెప్టెన్‌గా పనిచేశాను. ఆ మ్యాచ్ మేము ఓడిపోయినప్పటికి నాకు మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే. మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా లేకపోయినా.. కెప్టెన్‌గా కాస్త అనుభవాన్ని సంపాదించుకున్నా. ఇక ప్రొటీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు సవాల్. ఎలాగైనా సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: Ind vs Sa ODI Series: రుతురాజ్‌కు నో ఛాన్స్.. ధావన్, చహల్‌కు అవకాశం!
Comments
Please login to add a commentAdd a comment