
టీమిండియా మెషిన్‌గన్ విరాట్ కోహ్లి ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో తన హావభావాలతో ఎన్నోసార్లు అభిమానులను మెప్పించిన కోహ్లి సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి ఏడేళ్ల తర్వాత మళ్లీ సీనియర్ ఆటగాడిగా మ్యాచ్ ఆడుతున్నాడు.
చదవండి: నాలుగేళ్ల తర్వాత అశ్విన్‌కు వికెట్; బుమ్రా 925 రోజుల నిరీక్షణకు తెర
మొన్నటివరకు టీమిండియా కెప్టెన్‌గా తన సహచరులకు సలహాలు, మార్గనిర్దేశనం చేస్తూ కనిపించిన కోహ్లి... తాజాగా కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సీనియర్ ఆటగాడిగా అదే జోరును చూపించాడు. కేఎల్ రాహుల్‌కు సూచనలు చేస్తూ కనిపించిన కోహ్లి.. సౌతాఫ్రికా వికెట్ పడిన ప్రతీసారి తనదైన జోష్ చూపించాడు.మైదానంలో పాదరసంలా కదులుతూ.. తన సహచర ఆటగాళ్లను ఉత్సాహపరుస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ సమయంలో పాతకోహ్లిని చూస్తామని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బవుమా(110), వాండర్ డుసెన్(129*) సెంచరీలతో కదం తొక్కడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.
చదవండి: Ind Vs Sa 1st ODI: ధావన్‌కు షాక్... ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్!