Virat Kohli Press Conference Live Today Ahead Of India Tour Of South Africa: Reports - Sakshi
Sakshi News home page

Virat Kohli Press Conference: వన్డేలు ఆడుతాడా లేదా?.. మీడియా ముందుకు కోహ్లి!

Published Wed, Dec 15 2021 12:11 PM | Last Updated on Wed, Dec 15 2021 12:43 PM

Reports Virat Kohli Press Conference LIVE At 1 PM Will Play ODIs SA Tour - Sakshi

Virat Kohli Press Confernce About Playing ODIs In SA Tour.. దక్షిణాఫ్రికా టూర్‌ మొదలైనప్పటి నుంచి ఆ సిరీస్‌ కంటే కెప్టెన్సీ విషయం ఎక్కువ ప్రాధాన్యం సంతరించకుంది. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తొలగించి రోహిత్‌ను ఎంపిక చేసినప్పటి నుంచి సమస్య పెరిగిపోతుందే తప్ప కొలిక్కి రావడం లేదు. దీనికి తోడూ సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా ఆడనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్‌ దూరమవ్వడం.. ఆ తర్వాత రోహిత్‌ సారధ్యంలో టీమిండియా ఆడనున్న వన్డే సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది.

చదవండి: India Tour Of SA: కోహ్లి నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు

Virat Kohli: వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో కోహ్లి!

ఈ నేపథ్యంలో రోహిత్‌, కోహ్లి మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని పలు మీడియాలు కథనాలు ప్రచురించాయి. రోహిత్‌ కెప్టెన్సీలో కోహ్లి ఆడడానికి ఇష్టపడడం లేదని... అదే సమయంలో అటు రోహిత్‌ కూడా కోహ్లి నాయకత్వంలో ఆడేందుకు సముఖుత చూపించడం లేదంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రశ్నలన్నింటకి సమాధానం చెప్పడానికి కోహ్లి బుధవారం మధ్యాహ్నం 1గంటకు ప్రెస్‌మీట్‌ పెట్టనున్నట్లు సమాచారం.

అయితే మీడియా ముందుకు వస్తున్న కోహ్లి సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌లో ఆడుతాడా లేక వైట్‌బాల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకరకంగా తనను అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తొలగించారన్న బాధను మనుసులో పెట్టుకున్న కోహ్లి వన్డేలు, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు ఇప్పటికే పలు కథనాలు ప్రచురితమయ్యాయి. మరి నిజంగా కోహ్లి మీడియా ముందుకు రానున్నాడా లేక ఇది కూడా గాలి వార్తేనా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

చదవండి: ఒకరి గురించి ఒకరికి తెలుసు.. కోహ్లి వల్లే ఇదంతా.. రోహిత్‌ ప్రశంసల జల్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement