IND vs SA, 2nd ODI: Virat Kohli Dance Movement Dressing Room Enjoying Pant Batting - Sakshi
Sakshi News home page

Virat Kohli: డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి చిందులు.. వీడియో వైరల్‌

Published Fri, Jan 21 2022 6:28 PM | Last Updated on Fri, Jan 21 2022 6:56 PM

IND Vs SA:  Kohli Dance Movement Dressing Room Enjoying Pant Batting - Sakshi

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి డకౌట్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. కోహ్లికి ఇది 450వ వన్డే మ్యాచ్‌ కావడం విశేషం. వన్డేల్లో 14వ సారి డకౌట్‌ అయిన కోహ్లి.. తన చర్యతో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేశాడు. మ్యాచ్‌లో 85 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌ను అభినందిస్తూ కోహ్లి డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి అతన్ని అభినందిస్తూ డ్యాన్స్‌ చేయడం వైరల్‌గా మారింది. భయం అనేది లేకుండా సౌతాఫ్రికా బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన పంత్‌ ఆటతీరుకు ముగ్దుడైన విరాట్‌.. తన చేతులతో డ్యాన్స్‌ మూమెంట్స్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. కోహ్లి పక్కనే కూర్చున్న శిఖర్‌ ధావన్‌.. అతని​ డ్యాన్స్‌ చూస్తూ నవ్వుల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IND Vs SA: లడ్డూలాంటి అవకాశం.. బతికిపోయిన కేఎల్‌ రాహుల్‌

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆరంభంలోనే ధావన్‌(29), కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి.. కేఎల్‌ రాహుల్‌(55), పంత్‌(85) పరుగులు చేయడంతో పాటు.. మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో టీమిండియా 183/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ వెనువెంటనే పంత్‌, రాహుల్‌ ఔట్‌ కావడంతో టీమిండియా బ్యాటింగ్‌ తడబడింది. చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌ 40 నాటౌట్‌ ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్‌ షంసీ 2, మగల, మార్క్రమ్‌, కేశవ్‌ మహరాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

చదవండి: 450వ మ్యాచ్‌.. కోహ్లి చెత్త రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement