Bumrah Stunning Delivery To Dean Elgar.. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. 273/3తో పటిష్టంగా కనిపించిన టీమిండియా రాహుల్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. కేవలం 55 పరుగులు వ్యవధిలో మిగతా ఏడు వికెట్లను చేజార్చుకోవడం ఆసక్తి కలిగించింది. అయితే రాహుల్ సెంచరీతో మెరవడం, మయాంక్ అర్థసెంచరీ, రహానే 48 పరుగులతో రాణించడంతో టీమిండియా కాస్త చెప్పుకోదగ్గ స్కోరును చేయగలిగింది.
చదవండి: AUS vs ENG: 18 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్
ఇక దక్షిణాఫ్రికాకు.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే బుమ్రా గట్టి షాక్ ఇచ్చాడు. ఒక పరుగు చేసిన కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను బుమ్రా తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. ఆఫ్‌స్టంప్ దిశగా బుమ్రా వేసిన ఐదో బంతిని ఎల్గర్ అనవసరంగా గెలుక్కున్నాడు. దీంతో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లడం.. కీపర్ పంత్ సూపర్ డైవింగ్‌తో క్యాచ్ తీసుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశాడు. ఒక రకంగా టీమిండియాకు డీన్ ఎల్గర్ పెద్ద వికెట్ అని చెప్పొచ్చు. కెప్టెన్ ఔటైతే ఆ జట్టు ఒత్తిడిలో పడే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా రెండు సెషన్లు మిగిలి ఉండడంతో టీమిండియా బౌలర్లు ఎన్ని వికెట్లు పడగొడతారనేది చూడాలి.
చదవండి: యాషెస్ సిరీస్ ఆసీస్ కైవసం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
India draws first blood, SA' s Captain, walks back to the pavilion #INDvsSA #SAvIND #IndianCricketTeam #DisneyPlusHotstarID #DisneyPlusHotstarTH #DisneyPlusHotstar pic.twitter.com/vyRVgqOwxh
— Inian Kumar Ganesan (@Inian14) December 28, 2021
Comments
Please login to add a commentAdd a comment