
రోహిత్ శర్మ (ఫైల్‌ఫొటో)
సఫారీలతో సిరీస్‌లో రాణిస్తున్న స్పిన్నర్లు చహాల్, కుల్దీప్ యాదవ్‌లపై భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఏసందర్భంలోనైనా బౌలింగ్ చేయగల సత్తాఉన్న ఆటగాళ్లుగా రాణిస్తున్నారనంటూ ఆకాశానికెత్తేశాడు. చహాల్ గుగ్లీలను అర్థం చేసుకోవడం కష్టమైన పని అని, ఎక్కువ మంది ఆటగాళ్లు అతని బౌలింగ్‌లో ఆడటానికి ఇబ్బంది పడతారని తెలిపాడు
అలాగే వరుసగా విఫలమౌతున్న రోహిత్‌శర్మను వెనుకేసుకొచ్చాడు. 'గత రెండు వన్డేల్లో రోహిత్ 35 పరుగులు మాత్రమే చేశాడు. అది అసలు సమస్యే కాదు, అతని టైమింగ్ సూపర్, గత మ్యాచ్‌లో బాగా ఆడాడు, కానీ దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాడు. త్వరలోనే ఫాంలోకి వస్తాడు. గత ఛాంపియన్ ట్రోఫీ నుంచి చాలా నిలకడగా ఆడుతున్నాడు. కొన్ని సార్లు రోహిత్ పరుగులు చేయలేక పోవచ్చు. కానీ బంతిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ముఖ్యం. రోహిత్ ఫామ్ గురించి ఏమాత్రం ఆందోళన అవసరం లేదు. అతడు నిలదొక్కుకోవడానికి మరికొన్నిమ్యాచ్‌లు అవసరం. సమస్యలు అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి.' అంటూ వ్యాఖ్యానించాడు.
జట్టు సభ్యుల మధ్య సమన్వయం వల్లే విజయాలు సాధ్యమౌతున్నాయని పేర్కొన్నాడు. జట్టు ఆటగాళ్లలో చాలా సహకారం, సమన్వయం ఉంది, సీనియర్ ఆటగాళ్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉందన్నాడు. యువ ఆటగాళ్లు ఆటలో చాలా పరిణితి కనపరుస్తున్నారని ఆదే తమ బలమని ధావన్ పేర్కొన్నాడు.