West Indies vs India, 3rd T20I: వెస్టిండీస్‌తో తొలి టీ20లో 21 పరుగులు.. రెండో టీ20లో ఒకే ఒక్క పరుగు చేసి రనౌట్.. టీమిండియా స్టార్ సర్యకుమార్ యాదవ్ తొలి రెండు టీ20 మ్యాచ్‌లలో విఫలం కావడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. టీ20 నంబర్ 1 బ్యాటర్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదంటూ అభిమానులే పెదవి విరిచారు.
ఈ రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఓటమి చెందడం విమర్శల పదునును మరింత పెంచింది. అయితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సూర్య విజృంభించాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తన విలువేంటో చాటుకున్నాడు.
స్కై వీరవిహారం
విండీస్‌తో మంగళవారం నాటి మూడో టీ20లో స్కై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్ విఫలమైన వేళ తిలక్ వర్మతో కలిసి జట్టును ఆదుకున్నాడు. 44 బంతుల్లోనే 83 పరుగులతో సత్తా చాటాడు. 10 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది వింటేజ్ సూర్యను గుర్తు చేశాడు.
సిక్స్‌ల సెంచరీ
జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడమే గాకుండా.. టీ20లలో మరో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ‘సిక్స్‌ల సెంచరీ’ కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లిని అధిగమించాడు. అంతేకాదు.. భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టి అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానం ఆక్రమించాడు.
కాగా శిఖర్ ధావన్ 68 టీ20 మ్యాచ్‌లలో 126కు పైగా స్ట్రైక్‌రేటుతో 1759 పరుగులు సాధించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 49 ఇన్నింగ్స్ ఆడి.. 174కు పైగా స్ట్రైక్‌రేటుతో 1780 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సూర్య అత్యధిక స్కోరు 117.
అంతర్జాతీయ టీ20లలో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు
►సూర్యకుమార్ యాదవ్- 49 ఇన్నింగ్స్‌లో 101 సిక్సర్లు
►విరాట్ కోహ్లి- 107 ఇన్నింగ్స్‌లో 117 సిక్సర్లు
►రోహిత్ శర్మ- 140 ఇన్నింగ్స్‌లో 182 సిక్సర్లు
వీళ్లు కూడా..
ఇక ఇతర బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 68 ఇన్నింగ్స్‌లో 99, యువరాజ్ సింగ్ 51 ఇన్నింగ్స్‌లో 74, హార్దిక్‌పాండ్యా 70 ఇన్నింగ్స్‌లో 68, సురేశ్ రైనా 66 ఇన్నింగ్స్‌లో 58, మహేంద్ర సింగ్ ధోని 85 ఇన్నింగ్స్‌లో 52, శిఖర్ ధావన్ 66 ఇన్నింగ్స్‌లో 50 సిక్స్‌లు బాదారు.
ఇదిలా ఉంటే.. విండీస్‌తో మూడో టీ20 సందర్భంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సూర్య.. ఈ అవార్డు అందుకోవడం ఇది పన్నెండోసారి. ఈ జాబితాలో కోహ్లి 15 అవార్డులతో అగ్రస్థానంలో ఉండగా.. సూర్య.. రోహిత్‌తో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: రన్‌రేట్ అవసరం లేదు.. హార్దిక్ చేసింది ముమ్మాటికీ తప్పే!
Form is temporary. Surya is permanent!
— FanCode (@FanCode) August 8, 2023
.#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/QRdE8Eg8BQ
Comments
Please login to add a commentAdd a comment