సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పంత్‌తో జరిగిన సమన్వయ లోపం వల్ల కేఎల్ రాహుల్ కొద్దిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఆఖరి బంతిని పంత్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. రిస్క్ అని తెలిసినా కేఎల్ రాహుల్ క్విక్ సింగిల్ కోసం పరిగెత్తాడు. అయితే స్ట్రైకింగ్‌లో ఉన్న పంత్ వద్దని చెబుతున్నప్పటికి.. అప్పటికే రాహుల్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు చేరుకున్నాడు.
చదవండి: 450వ మ్యాచ్.. కోహ్లి చెత్త రికార్డు
ఇంతలో బంతిని అందుకున్న బవుమా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసురుదామనుకున్నాడు. ఇక రాహుల్ ఔట్ అని మనం అనుకునేలోపు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బవుమా సరైన దిశలో బంతిని వేయకపోవడం.. కేశవ్ మహరాజ్ దానిని అందుకోవడం విఫలమవ్వడం.. అప్పటికే రాహుల్ వేగంగా పరిగెత్తి క్రీజులోకి చేరుకోవడం జరిగిపోయింది.అలా టీమిండియా బతికిపోయింది.. రాహుల్ కూడా బతికిపోయాడు. ఈ సంఘటన తర్వాత రాహుల్ పంత్‌వైపు.. ''అరె పంత్.. కొంచమైతే కొంపముంచేవాడివి అన్నట్లుగా'' చూశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
😭#SAvIND pic.twitter.com/nGoDadBwAF
— ًFaf Du Plessis (@Fad_du_pussy) January 21, 2022
Comments
Please login to add a commentAdd a comment