
టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ త్రోతో మెరిశాడు. రాహుల్ త్రో దెబ్బకు బవుమా రనౌట్‌గా వెనుదిరిగాడు. 12 బంతుల్లో 8 పరుగులతో బవుమా మంచి టచ్‌లో కనిపించాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో మూడో బంతిని బవుమా మిడాఫ్ దిశగా ఆడాడు. క్విక్ సింగిల్ తీయాలని భావించిన బవుమా చేతులు కాల్చుకున్నాడు. రిస్క్ అని తెలిసినప్పటికి పరిగెత్తాడు.. అప్పటికే బంతిని అందుకున్న రాహుల్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు త్రో విసిరాడు. డైరెక్ట్ హిట్‌తో బవుమా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం బవుమా రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ సెంచరీతో మెరవగా.. డుసెన్ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు.
— Bleh (@rishabh2209420) January 23, 2022
Comments
Please login to add a commentAdd a comment