సోషల్ మీడియాలో ఆసక్తిగా ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల ఓ టెక్నాలజీకి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఇందులో ఒక ట్రక్ నిమిషాల వ్యవధిలో ఫుడ్ రెస్టారెంట్‌గా మారిపోయింది.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో రోడ్డు పక్కన ఒక ట్రక్కు ఆగింది. బయట నిలబడి ఉన్న ఒక వ్యక్తి బటన్ నొక్కిన వెంటనే.. ఏదో ఒక రోబో మాదిరిగా తనకు తానుగానే డోర్స్ ఓపెన్ చేసుకుని.. గోడలు లాంటివి సెట్ చేసుకుని ఓ అద్భుతమైన రెస్టారెంట్‌గా మారిపోయింది.
ఇలాంటి ట్రక్కులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఎలా అంటే బిజినెస్ ఎక్కడ ఎక్కువ జరుగుతుందనుకుంటే అక్కడ ఈ ట్రక్కును ఆపి బిజినెస్ చేసుకోవచ్చు. దీని వల్ల రూమ్ రెంట్స్ వంటివి తగ్గుతాయి. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఆ టెక్నాలజీకి ఎవ్వరైనా ముగ్దులై ఉండిపోతారు.
ఈ వీడియో షేర్ చేస్తూ.. ఫాస్ట్ ఫుడ్, ఫుడ్ ట్రక్.. ఇప్పుడు ఫాస్ట్ రెస్టారెంట్ అంటూనే ఇలాంటి ట్రక్ ఉంటే ఒకే స్థానంలో రెస్టారెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ మార్కెట్ ఉంటె అక్కడకు వెళ్లొచ్చు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Fast Food.
— anand mahindra (@anandmahindra) February 20, 2024
Food trucks.
And now:
Fast Restaurants.
A new business model since it gives liberation from location to full-size restaurants.
It just goes where the market is.
👏🏽👏🏽👏🏽👍🏽pic.twitter.com/qU5hSBxUWx
Comments
Please login to add a commentAdd a comment