ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకుంటారు. తాజాగా @MahindraXUV700కు సంబంధించిన ట్వీట్‌ను ఆనంద్ మహీంద్రా నెటిజన్లతో పంచుకున్నాడు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.. "ఇది మాకు ఒక పెద్ద రోజు. ప్రపంచ స్థాయి, స్వదేశీ ఉత్పత్తులకు ఈ గుర్తింపు ఇచ్చి ప్రోత్సహించినందుకు జ్యూరీకి పెద్ద ధన్యవాదాలు. మహీంద్రాఎక్స్‌యూవీ 700ను డిజైన్ , అభివృద్ధి చేసి దేశీయంగా తయారు చేసినందుకు గర్వంగా" ఉంది అని ఐకోటీ జ్యూరీని రిట్వీట్ చేస్తూ అన్నారు.
అయితే, ఐకోటీ జ్యూరీ@ICOTY_jury తన ట్వీట్‌లో.. "ఇతర ఉత్పత్తులతో గట్టి పోటీని ఎదుర్కొన్న తర్వాత ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వదేశీ మహీంద్రాఎక్స్‌యూవీ 700 కారు అందుకుంది. స్వదేశంలో భారత తయారీ కంపెనీలు ఇప్పుడు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేస్తున్నారని అనడానికి ఇది నిదర్శనం" అని పేర్కొంది. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
A big day for us. And a big thank you to the jury for this recognition and encouragement of world-class, homegrown products. Designed, Developed and Made in India with Pride… https://t.co/gWFpvuH7DU
— anand mahindra (@anandmahindra) March 10, 2022
(చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..!)
Comments
Please login to add a commentAdd a comment