
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ఇలాంటి ఉత్తేజకరమైన వార్తను నేను ఎలా మిస్ అయ్యాను అంటూ ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో మార్చిలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించినది. సుప్రీంకోర్టులో వంటమనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ కుమార్తె ప్రజ్ఙను.. భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞ తల్లితండ్రులను జస్టిస్ చంద్రచూడ్ సన్మానించారు.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. భారతదేశం ఎందుకు పుంజుకుంటుంది అని ఎవరైనా నన్ను అడిగితే, నేను ఈ వీడియోను షేర్ చేస్తాను. ఇది నిబద్దత, కృషి, తల్లిదండ్రుల మద్దతుకు నిదర్శనం. యునైటెడ్ స్టేట్స్‌లోని రెండు వేర్వేరు విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ అధ్యయనం చేయడానికి స్కాలర్‌షిప్ సాధించినందుకు, ఒక కుక్ కుమార్తె అభినందించారు అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
I don’t know how I missed seeing this uplifting news in March this year.
If anyone asks me why I think India will rise, I will share this video.
It’s about aspirations, commitment, hard work & parental support.
And most important, about us all recognizing & cheering each… pic.twitter.com/4bVPEtm8tB— anand mahindra (@anandmahindra) June 20, 2024
Comments
Please login to add a commentAdd a comment