Anand Mahindra skipped lunch ahead of the US State dinner with PM Modi - Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్‌ మహీంద్ర

Published Fri, Jun 23 2023 10:58 AM | Last Updated on Fri, Jun 23 2023 12:32 PM

Anand Mahindra skipped lunch ahead of the US State Dinner with PM Modi - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన అభిమానులను ఎపుడూ నిరాశ పర్చరు. బుధవారం దుబాయ్‌లో ప్రారంభమైన వరల్డ్‌ చెక్‌ లీగ్‌ గురించి ట్వీట్‌ చేసిన మహీంద్ర గురువారం వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టారు. వైట్‌హౌస్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం వాషింగ్టన్‌లోని స్టేట్ డిన్నర్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్‌ చేశారు. దీంతో గ్రేట్‌ సర్‌ అంటూ  ఫ్యాన్స్‌ తెగ సంతోష పడుతున్నారు. (వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు..)

ఈ సందర్భంగా  అక్కడ సంగీత వాయిద్యాలతో స్వాగతం పలికిన తీరు, థీమ్‌ వంటలపై ఆశ్చర్యాన్ని ప్రకటించారు అంతేకాదు స్టేట్ డిన్నర్‌లో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ హోస్ట్ చేసే విందును కడుపారా ఆరగించేందుకు మధ్యాహ్న భోజనాన్ని  స్కిప్‌ చేశానంటూ తనదైన శైలిలో  చమత్కరించారు. 

కాగా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టుగా  తొలిసారి వైట్ హౌస్‌లో పూర్తిగా మొక్కల ఆధారితమైన రాష్ట్ర విందును నిర్వహించడం విశేషం. మాంసం, పాల  ఉత్పత్తులు, గుడ్లు లాంటివేవీ లేకుండా పూర్తిగి శాఖాహారాన్ని వడ్డించారు..(స్టార్ క్రికెటర్‌ కొత్త సూపర్‌ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!)

400 మంది  వీవీఐపీలు హాజరైన ఈ డిన్నర్‌కు  ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్ పిచాయ్,మైక్రోసాఫట్‌ సత్య నాదెళ్ల,యాపిల్‌ సీఈవో టిమ్ కుక్, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్, సహా ఆసియా బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ దంపతులు,పెప్సికో మాజీ చైర్‌పర్సన్  సీఈవో ఇంద్రా నూయి, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ లాంటి పలువురు ప్రముఖులతో కలిసి స్టేట్ డిన్నర్‌లో సందడి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement