2024 ఎన్నికల్లో ఇది బెస్ట్ ఫోటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్ | This Best Picture of Me In 2024 Elections Says Anand Mahindra | Sakshi
Sakshi News home page

2024 ఎన్నికల్లో ఇది బెస్ట్ ఫోటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్

Published Mon, May 20 2024 6:02 PM | Last Updated on Mon, May 20 2024 6:41 PM

This Best Picture of Me In 2024 Elections Says Anand Mahindra

భారతదేశంలో ఐదో దశ ఎన్నికలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇందులో ప్రముఖ బిజినెస్ మ్యాన్స్ రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా ఉన్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 'మనల్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే అవకాశం. ఇది ఒక బ్లెస్సింగ్ అంటూ.. ట్వీట్ చేశారు.

మరో ఫోటో షేర్ చేస్తూ.. 2024 ఎన్నికలలో ఇది ఉత్తమ చిత్రం, గ్రేట్ నికోబార్‌లోని షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు, మొదటిసారి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎదురులేని, తిరుగులేని శక్తి అంటూ.. ఆ తెగకు చెందిన వ్యక్తి ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement