Anand Mahindra: యుద్ధంలో చివరికి తేలే ఫలితం ఇదే | Anand Mahindra Tweet On Ukraine Russia War | Sakshi
Sakshi News home page

Anand Mahindra: యుద్ధంలో చివరికి తేలే ఫలితం ఇదే

Published Fri, Mar 11 2022 2:10 PM | Last Updated on Fri, Mar 11 2022 2:17 PM

Anand Mahindra Tweet On Ukraine Russia War - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్ర తర్వాత... ప్రపంచ దేశాలు ముఖ్యంగా పశ్చిమం రష్యా వైఖరిని తప్పుపడుతున్నాయి.  అమెరికా ఎత్తుగడలు ఉక్రెయిన్‌ మొండితనం వల్లే దాడి చేయాల్సి వచ్చిందనే అభిప్రాయం రష్యా మద్దతుదారులు అంటున్నారు. తప్పొప్పుల సంగతి పక్కన పెడితే అసలు యుద్ధంలో చివరి ఏం సాధిస్తారనే అంశం ఇప్పుడు చర్చకు వస్తోంది.

ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం ఇప్పటికే మూడో వారంలోకి ప్రవేశించింది. ఇరు వైపుల భారీ ఆస్తి నష్టం సంభవించింది. తుపాకి తూటాలకు వేల సంఖ్యలో సైనికులు నేలకొరుగుతున్నారు. ఈ తరుణంలో యుద్ధంతో సాధించేది ఏమిటంటూ ఆనంద్‌ మహీం‍ద్రా ట్వీట్‌ చేశారు. యుద్ధంలో ఎవరిది రైట్‌ అనేది ఎప్పటికీ తేలని అంశమని.. యుద్ధంలో ఎవరిని కోల్పోయామన్నదే చివరికి తేలే సత్యమన్నారు ఆనంద్‌ మహీంద్రా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement