దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెన్‌ను ఉద్దేశించి, తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రకటనలలో ఉద్యోగ కల్పన గురించి వెల్లడించడాన్ని అంశాన్ని ఆయన ప్రశంసించారు.
యువతకు ఉపాధి కల్పించాలనే నిర్ణయం ప్రశంసనీయం. దీనికి తగిన విధంగా ప్రైవేట్ రంగం కృషి చేయాలి. ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రైవేట్ రంగం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, మన ముందున్న కర్తవ్యం ఇదే అని.. ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.
యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకపోతే.. రాబోయే రోజుల్లో విపత్తుగా మారే అవకాశం ఉందని ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిలో మనదేశం ప్రపంచమే అసూయపడేలా మనదేశం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పథకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
We are the envy of the world in terms of our growth in GDP.
We are the preferred destination of the world for investment because of the belief in our future.
But the vital task ahead for us is to ensure that this growth is now accompanied by an explosion in job-creation.… pic.twitter.com/Z73BKJwWR1— anand mahindra (@anandmahindra) July 24, 2024
Comments
Please login to add a commentAdd a comment