దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. ఇది చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఎక్స్‌కవేటర్ ట్రక్కును పార్ట్స్.. పార్ట్స్‌గా విడదీయడం చూడవచ్చు. ఇది ఓ ఫ్యాక్టరీలో జరిగినట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ట్రక్ హత్యగా పేర్కొంటూ.. దీనికి కారణమైన ఎక్స్‌కవేటర్‌ను అరెస్ట్ చేయండంటూ పేర్కొన్నారు.
ఒక ట్రక్కును తయారు చేయడానికి ఎంత టెక్నాలజీ, కృషి అవసరమో మాకు తెలుసు. కానీ అలాంటి ట్రక్కును కనికరం లేకుండా ముక్కలు చేయడం చాలా బాధాకరంగా ఉందని, రీ సైక్లింగ్ ద్వారా అవి మళ్ళీ ఎప్పటికైనా జీవిస్తాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఇది చాలా బాధాకరమని, ఆ ఎక్స్‌కవేటర్ హ్యుందాయ్ కంపెనీకి చెందిందని కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
ఇదీ చదవండి: 50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే!
Someone arrest that claw-excavator for ‘truck homicide!’
— anand mahindra (@anandmahindra) February 22, 2024
As manufacturers, we know how much technology & effort goes into producing trucks.
Hurts to see them so mercilessly torn apart.
But I suppose through recycling they’ll live ‘forever.’ 🙂pic.twitter.com/vvhMDKF6MI
Comments
Please login to add a commentAdd a comment