excavator attack
-
అరెస్ట్ చేయండి!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. ఇది చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఎక్స్కవేటర్ ట్రక్కును పార్ట్స్.. పార్ట్స్‌గా విడదీయడం చూడవచ్చు. ఇది ఓ ఫ్యాక్టరీలో జరిగినట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ట్రక్ హత్యగా పేర్కొంటూ.. దీనికి కారణమైన ఎక్స్‌కవేటర్‌ను అరెస్ట్ చేయండంటూ పేర్కొన్నారు. ఒక ట్రక్కును తయారు చేయడానికి ఎంత టెక్నాలజీ, కృషి అవసరమో మాకు తెలుసు. కానీ అలాంటి ట్రక్కును కనికరం లేకుండా ముక్కలు చేయడం చాలా బాధాకరంగా ఉందని, రీ సైక్లింగ్ ద్వారా అవి మళ్ళీ ఎప్పటికైనా జీవిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఇది చాలా బాధాకరమని, ఆ ఎక్స్కవేటర్ హ్యుందాయ్ కంపెనీకి చెందిందని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదీ చదవండి: 50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే! Someone arrest that claw-excavator for ‘truck homicide!’ As manufacturers, we know how much technology & effort goes into producing trucks. Hurts to see them so mercilessly torn apart. But I suppose through recycling they’ll live ‘forever.’ 🙂pic.twitter.com/vvhMDKF6MI — anand mahindra (@anandmahindra) February 22, 2024 -
దొంగల తెలివి...ఏటీఎం మిషన్నే తవ్వేందుకు యత్నం: వీడియో వైరల్
Thieves can go to any extent: ఇటీవలే బిహార్‌లో ఒక దొంగల ముఠా స్టీల్ బ్రిడ్జ్‌ని దొంగలించిన సంటన గురించి విన్నాం. అంతేందుక ఒక దొంగ ఒక మహిళ దృష్టి మరల్చడానిక హఠాత్తుగా డ్యాన్స్ చేసి రోలెక్స్ వాచ్‌ని ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి డబ్బులు కోసం ఏటీఎం మిషన్‌ని ఎత్తుకుపోవాలనుకున్నాడు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లే...మహారాష్ట్రాలోని దొంగలు డబ్బులు కోసం ఏకంగా ఏటీఎం మిషన్‌ని తవ్వేందుకు యత్నించారు. అందుకోసం ఏకంగా ఎక్స్‌కవేటర్‌ని ఉపయోగించారు. ఈ ఘటన చూస్తే డబ్బలు కోసం ఎంతకైన తెగిస్తారు దొంగలు అన్నట్లుగా ఉంది. అయితే ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు దొంగల ధైర్యాన్ని చూసి ఫిదా అవ్వడమే కాకుండా నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయంటూ... ట్వీట్ చేశారు. JCB Crane used to steal #ATM Machine in Maharshtra#Robbery pic.twitter.com/CSLn3nQohS — శంకర్ ముదిరాజ్ (@Gsk339) April 24, 2022 (పిల్లలను తుపాకితో బెదిరిస్తున్న దుండగుడి వీడియోలు వైరల్) -
కామాటి దుశ్చర్య
♦ పాలమాకులలో హాస్టల్ విద్యార్థులపై దాడి ♦ తలకు గాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ♦ కులం పేరుతో దూషించాడని విద్యార్థుల ఆరోపణ నంగునూరు: ఓ హాస్టల్ విద్యార్థులపై కామాటి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం పాలమాకులలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించడమే కాకుండా పలువురిపై గరిట, కర్రతో దాడి చేయడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం... నారాయణఖేడ్ మండలానికి చెందిన విద్యార్థులు పాలమాకుల ఎస్సీ హాస్టల్లో ఉండి స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. పదోతరగతి విద్యార్థులు కొందరు ఒకచోట చేరి మాట్లాడుకుంటుండగా కామాటి లక్ష్మణ్ వారిని దూషించాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించగా కులం పేరుతోపాటు తీవ్ర పదజాలంతో దూషించాడు. ఈ క్రమంలో కామాటికి విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరింత ఆగ్రహానికి లోనైన కామాటి పదోతరగతి విద్యార్థి వి.శ్రీనును గరిటతో కొట్టడంతో తలకు గాయమైంది. అక్కడే ఉన్న ఆర్.బాలజీ షర్ట్ చిరగడంతోపాటు జయపాల్, శ్రీకాంత్, ప్రకాశ్లపై కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధిత విద్యార్థులు రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ కొమురయ్య హాస్టల్‌కు వెళ్లి విచారించగా కామాటి లక్ష్మణ్ విద్యార్థులపై దాడి చేసినట్టు తోటి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పదోతరగతి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి కులం పేరుతో దూషించిన కామాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.