భారతదేశ పర్యటనలో ఉన్న ఉబెర్ సీఈఓ 'దారా ఖోస్రోషాహి'ని మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా అతని నాయకత్వంలో రైడ్-హెయిలింగ్ యాప్ కంపెనీ ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్నీ వెల్లడిస్తూ ప్రశంసలు కురిపించారు.
దారా ఖోస్రోషాహి ఉబర్ సీఈఓగా నియమితులైన తొలి రోజుల్లో ఎన్నో సందేహాలు కలిగాయని, ఆ తరువాత దావోస్‌లో కలిసినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఆ సమయంలోనే కష్టాల్లో ఉన్న ఉబర్ గట్టెక్కుతుందా అనిపించిందని, కాబట్టి ఆయన ఎక్కువ రోజులు సీఈఓగా ఉండలేరని ఆనంద్ మహీంద్రా ఊహించనట్లు కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కష్టాల్లో ఉన్న ఉబర్ ఈ రోజు లాభాల బాట పట్టిందంట ఖచ్చితంగా దారా ఖోస్రోషాహి కృషి అని ఆనంద్ మహీంద్రా అన్నారు. నిజమైన నాయకుల గొప్ప లక్షణమే సంస్థ అభివృద్ధికి కారణమవుతుందని వెల్లడించారు. నేడు ఉబర్ 170 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌తో లాభాలను ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా..
I first met @dkhos in Davos shortly after he had taken the helm at @Uber
— anand mahindra (@anandmahindra) February 24, 2024
I must confess that I wondered how long he would stay at the company & indeed, how long Uber would survive.
Today, the company is solidly profitable, its corporate culture is disciplined and no-frills, &… pic.twitter.com/hHwFPCq7P9
Comments
Please login to add a commentAdd a comment