Dara Khosrowshahi
-
ఉబర్ సీఈఓను పొగడ్తలతో ముంచేసిన 'ఆనంద్ మహీంద్రా' - ట్వీట్ వైరల్
భారతదేశ పర్యటనలో ఉన్న ఉబెర్ సీఈఓ 'దారా ఖోస్రోషాహి'ని మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా అతని నాయకత్వంలో రైడ్-హెయిలింగ్ యాప్ కంపెనీ ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్నీ వెల్లడిస్తూ ప్రశంసలు కురిపించారు. దారా ఖోస్రోషాహి ఉబర్ సీఈఓగా నియమితులైన తొలి రోజుల్లో ఎన్నో సందేహాలు కలిగాయని, ఆ తరువాత దావోస్‌లో కలిసినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఆ సమయంలోనే కష్టాల్లో ఉన్న ఉబర్ గట్టెక్కుతుందా అనిపించిందని, కాబట్టి ఆయన ఎక్కువ రోజులు సీఈఓగా ఉండలేరని ఆనంద్ మహీంద్రా ఊహించనట్లు కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ఉబర్ ఈ రోజు లాభాల బాట పట్టిందంట ఖచ్చితంగా దారా ఖోస్రోషాహి కృషి అని ఆనంద్ మహీంద్రా అన్నారు. నిజమైన నాయకుల గొప్ప లక్షణమే సంస్థ అభివృద్ధికి కారణమవుతుందని వెల్లడించారు. నేడు ఉబర్ 170 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌తో లాభాలను ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా.. I first met @dkhos in Davos shortly after he had taken the helm at @Uber I must confess that I wondered how long he would stay at the company & indeed, how long Uber would survive. Today, the company is solidly profitable, its corporate culture is disciplined and no-frills, &… pic.twitter.com/hHwFPCq7P9 — anand mahindra (@anandmahindra) February 24, 2024 -
ఉబర్ సీఈఓతో గౌతమ్ అదానీ.. అసలేం జరుగుతోంది!
ప్రముఖ పారిశ్రామిక వేత్త 'గౌతమ్ అదానీ' శనివారం ఉబర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'దారా ఖోస్రోవ్షాహి'తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను అదానీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. భారతదేశంలో గ్రీన్, పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను కూడా వేగవంతం చేయడానికి చేయడానికి, ఉబెర్‌తో భవిష్యత్ సహకారాల కోసం ఈ సమావేశం జరిగింది. ఫొటోలను షేర్ చేస్తూ.. భారతదేశంలో ఉబర్ విస్తరణకు సంబంధిచి దారా ఖోస్రోవ్షాహి విజన్ ప్రశంసించదగ్గదని కొనియాడారు. ప్రత్యేకించి భారతీయ డ్రైవర్ల గౌరవాన్ని పెంచడంలో అతనికున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్ రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశం యొక్క గ్రీన్ ఎనర్జీ పరివర్తనలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉంది. దేశంలో పునరుత్పాదక ఇంధనంలో ప్రపంచ అగ్రగామిగా నిలువడానికి సంస్థ కృషి చేస్తోంది. ఇదీ చదవండి: జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!.. మరో యాప్‌లోనే అన్నీ.. ఇక ఉబర్ విషయానికి వస్తే.. ఈ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తమ ఫ్లీట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఉబర్ గ్రీన్ అని పిలువబడే ఈవీ సర్వీస్ ఢిల్లీలో అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో దేశంలోని మరిన్ని నగరాలను ఈ సర్వీస్ విస్తరించనున్నట్లు సమాచారం. Absolutely captivating chat with @dkhos, CEO of @Uber. His vision for Uber's expansion in India is truly inspiring, especially his commitment to uplifting Indian drivers and their dignity. Excited for future collaborations with Dara and his team! #UberIndia pic.twitter.com/xkHkoNyu5s — Gautam Adani (@gautam_adani) February 24, 2024 -
సైకిల్ మీద ఉబెర్ సీఈవో ఫుడ్ డెలివరీ.. సంపాదన ఎంతంటే..
ప్రొఫెషనల్ డిగ్నిటీ, వృత్తిలో నైతిక విలువలు, పనిలో కష్టపడేతత్వం.. వీటికి తోడుగా అదృష్టం మనిషిని సక్సెస్ఫుల్ పర్సన్‌గా నిలబెడతాయి. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ.. ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహికి శ్రమ అంటే చాలా ఇష్టం.అందుకే అప్పుడప్పుడు గ్రౌండ్ లెవల్లోకి దిగి.. తోటి వర్కర్ల పనితీరును పర్యవేక్షిస్తుంటాడు. సరదాగా వాళ్లతో ఔటింగ్లకూ వెళ్తుంటాడు. అలాంటి వ్యక్తి ఈ మధ్య ఆయన స్వయంగా ఫుడ్ డెలివరీలు చేశాడు. అదీ సైకిల్ మీద తిరుగుతూ. ఆదివారం ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో సైకిల్ మీద ఉన్న ఫొటోను షేర్ చేసి.. టైం టు టైం అప్డేట్ పంచుకున్నాడు. పైగా డెలివరీల ద్వారా ఆరోజులో దాదాపు 100 డాలర్లు సంపాదించినట్లు వెల్లడించాడు. ఇక ఎలా సంపాదించారని కొందరు అడగ్గా.. ఒక్కో ఆర్డర్ మీద 6 నుంచి 23 డాలర్లు సంపాదించానని చెప్పుకొచ్చాడు. Spent a few hours delivering for @UberEats. 1. SF is an absolutely beautiful town. 2. Restaurant workers were incredibly nice, every time. 3. It was busy!! - 3:24 delivering out of 3:30 online. 4. I'm hungry - time to order some 🍔🍟🍺 pic.twitter.com/cXS1sVtGhS — dara khosrowshahi (@dkhos) June 27, 2021 పది ట్రిప్పులతో 98.91 డాలర్లు సంపాదించిన స్క్రీన్ షాట్ ఆయన షేర్ చేశాడు. ఇక పాజిటివ్ ఉన్నట్లే ఈ వ్యవహారంలో నెగెటివిటీ మొదలైంది. పబ్లిసిటీ స్టంట్ అదిరిందంటూ 52 ఏళ్ల దారా ఖోస్రోషాహిని కొందరు హేళన చేస్తున్నారు. ఇక ఇంకొందరు ఉబెర్ ఈట్స్ సర్వీసును పొగుడుతూనే.. ఆ వర్కర్లను మనుషుల్లా చూడడం నేర్వండంటూ దారాకి చురకలంటించారు. pic.twitter.com/MPpvzSceDC — dara khosrowshahi (@dkhos) June 27, 2021 చదవండి: భారతీయులకు ఉబెర్ సీఈవో హెచ్చరిక -
కరోనా : ఉబెర్ ఉద్యోగాల కోత
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభానికి ప్రభావితమైన ఉబెర్ టెక్నాలజీస్ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా 3,700 పూర్తికాల ఉద్యోగులను తొలగించనుంది. అలాగే ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి మిగిలిన సంవత్సరానికి గాను తన మూల వేతనాన్ని వదులుకోనున్నారు. ఈ మేరకు కంపెనీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో 14 శాతం ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 450 డ్రైవర్ సేవా కేంద్రాల్లో 40 శాతం మూసివేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి తమ వ్యాపారాలను నాశనం చేసిందని పేర్కొంది. ఇవి చాలా కఠినమైన రోజులు. రాబోయే రెండు వారాల్లో మరిన్ని"కష్టమైన సర్దుబాట్లు" జరుగుతాయంటూ సీఈవో తన ఉద్యోగులకు ఒక ఈమెయిల్ సందేశాన్ని పంపారు. గత ఏడాది జూలై నుండి అక్టోబర్ వరకు పలుమార్లు 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించి సంస్థ తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేయడం ఆదోళన మరింత ఆందోళన రేపింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా యాప్ ఆధారిత రైడింగ్ సేవల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది. దీంతో ఉబెర్ ఖర్చులను తగ్గించుకునే చర్యలకు దిగింది. ప్రస్తుత పరిస్థితిలో ఉబెర్ కు దాదాపు 20 మిలియన్ డాలర్ల వ్యయాలున్నట్టు అంచనా. మరోవైపు అమెరికాలో ఉబెర్ ప్రధాన ప్రత్యర్థి లిఫ్ట్ కూడా గత వారం 982 మంది లేదా 17శాతం మంది ఉద్యోగులను తొలగించింది. దీంతోపాటు ఉన్నతాధికారుల మూల వేతనాలను తగ్గించింది. కొత్త ప్రత్యర్థులు, ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా అనుసరించాల్సిన వినూత్న బిజినెస్ మోడల్స్ కారణంగా ఉబెర్, లిఫ్ట్ లాంటి షేరింగ్ క్యాబ్ సంస్థలు భవిష్యత్తులో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటాయని వెడ్ బుష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు డేనియల్ ఇవ్స్ చెప్పారు. ఎందుకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయడం అనేది సాధారణంగా మారిపోవడం, పాటించాల్సిన ఆరోగ్య నిబంధనలు, ఇతర ఆందోళనల కారణంగా ప్రజల వినియోగంలో మార్పు రావచ్చన్నారు. ఈ మందగమనం డ్రైవర్ల ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తుందన్నారు. డ్రైవర్లు కాంట్రాక్ట్ కార్మికులుగా మారిపోతారని అభిప్రాయపడ్డారు. అయితే బుధవారం, ఉబెర్ కొత్త ఈట్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇది రియల్ టైమ్ డెలివరీ ట్రాకింగ్‌తో ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. తన ఆహార పంపిణీ వ్యాపారంతో కొంత కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి పొందే అవకాశం వుందని భావిస్తున్నారు. మరోవైపు డ్రైవర్లను ఉద్యోగులకు బదులుగా స్వతంత్ర కాంట్రాక్టర్లుగా వర్గీకరించి, కార్మికుల ప్రయోజనాలను నిలిపి వేసిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియా సహా, అతిపెద్ద మూడు నగరాల్లో ఉబెర్, లిఫ్ట్‌పై కేసులు నమోదయ్యాయి. (ఆశ్చర్యపర్చిన యస్ బ్యాంకు ఫలితాలు) -
భారతీయులకు ఉబెర్ సీఈవో హెచ్చరిక
సాక్షి, న్యూడిల్లీ: భారతీయ కార్ల కొనుగోలుదారులకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఆసక్తికరమైన హెచ్చరిక చేశారు. కొత్త కార్లను కొనుగోలు ఉచ్చులో పడొద్దని భారతీయులను కోరారు. దీనికి బదులు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసుకోవడానికి తగిన కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఎస్టాబ్లిష్డ్ పరిశ్రమలకు దూరంగా వుండాలని హితవు చెప్పారు. ముఖ్యంగా ఆటోరంగం మందగమనానికి దోహదపడే అనేక అంశాలలో ఉబెర్, ఓలా వల్లే యువతరం (మిలీనియల్స్) కార్ల కొనుగోలుకు మొగ్గు చూపకపోవడం కూడా ఒకటి అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉబెర్ సీఈఓ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి)తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో కార్ల వినియోగం అధికంగా ఉందన్నారు. ఇలా సొంతకార్లను కలిగి వుండటం కొన్నిసార్లు ఆవిష్కరణలను నిరోధిస్తుందన్నారు. ఫలితంగా రాబోవు 10-20 సంవత్సరాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయలకు బదులుగ గత పది సంవత్సరాలకోసం రూపొందించిన వాటినే ఇప్పటికీ వాడుతున్నామన్నారు.అందుకే కారు సొంతం చేసుకోవడం అనేది నేటి తరం కలగాకూడదు, కోరుకున్నపుడు స్వేచ్ఛగా ప్రయాణించే సౌకర్యాలు, అలాంటి ఆవిష్కరణలు, పరిశ్రమలపై దృష్టి పెట్టాలన్నారు. అంతేకాదు పాతుకుపోయిన పరిశ్రమలు, పద్ధతులు నూతన ఆవిష్కరణలకు శత్రువులుగా మారాయని వ్యాఖ్యానించారు. దీన్ని అధిగమిస్తే భారత్ ఈ రంగంలో అగ్రగామిగా వుంటుందని ఖోస్రోషాహి పేర్కొన్నారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి)తో కలిసి ఉబెర్ తాజాగా మరో నూతన ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. యాప్‌లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫీచర్‌ద్వారా మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్ల ద్వారా క్యాబ్ సర్వీసులను అందిస్తున్న ఉబెర్ ఇపుడు బస్సులను కూడా ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీలో మంగళవారం విడుదల చేసింది. దీనిని ఢిల్లీలో కొన్ని ఎంపిక చేసిన ప్రధాన రూట్లలో నడుపుతారు. ఒకవేళ విజయవంతమైతే అన్ని చోట్లకూ, అన్ని ప్రధాన నగరాలకూ విస్తరిస్తామని ఆయన తెలిపారు. యాప్‌లో వినియోగదారులు తమ పికప్, డ్రాపింగ్ పాయింట్లను లోడ్ చేసుకోవాలి. అయితే నిర్ణీత ప్రదేశంలో (బస్స్టాప్ల్లాగా అన్నమాట)మాత్రమే ఎక్కాలి తప్ప ఇంటి వరకూ రాదు. చాలా తక్కువ ధరలో, తక్కువ సమయంలో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యమని ఉబెర్ పేర్కొంది. -
‘లైసెన్స్ తిరిగొస్తుందని నమ్మకముంది'
లండన్ : బ్రిటన్‌లో తన సర్వీసులను కొనసాగించేందుకు ఉబర్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ సంస్ధ బాస్ దారా ఖోస్రోవ్షాహి మంగళవారం లండన్ ట్రాన్స్పోర్ట్ అధికారి మైక్ బ్రౌన్‌ను కలవబోతున్నారు. ఈ నెల (సెప్టెంబర్) తర్వాత ఉబర్ తన సర్వీసులు కొనసాగించేందుకు వీల్లేదంటూ లండన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ లైసెన్స్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజల భద్రతను, తాము సూచించిన నిబంధనలను ఖాతరు చేయని కారణంగానే లైసెన్స్‌ను పునరుద్ధరించలేమని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు బహిరంగ క్షమాపణలు చెప్పిన దారా ఆ సమస్యను పరిష్కారం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 'మా కొత్త సీఈవో లండన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌ను వచ్చేవారం కలవనున్నారు. మేం లండన్ అధికారులతో సంప్రదింపులు చేసి తగిన పరిష్కారం కనుగొననున్నారు. లైసెన్స్ తిరిగొస్తుందని నమ్మకముంది' అని ఉబర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఉబర్‌కు 40వేలమంది డ్రైవర్లు ఉండటంతోపాటు ఒక్క లండన్‌లోనే 3.5మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. -
అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను
లండన్ : తమ సర్వీసులను పొందుతున్న ప్రపంచ వినియోగ దారులకు ఉబర్ సీఈవో దారా ఖోస్రోవ్షాహి క్షమాపణలు తెలియజేశారు. మున్ముందు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని, తమను తాము చక్కదిద్దుకుంటామని హామీ ఇచ్చారు. లండన్‌లో ఉబర్ తన లైసెన్స్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ లైసెన్స్ రద్దు చేస్తున్న సందర్భంగా పలు విషయాలను లండన్ లైసెన్స్ రెగ్యులారిటీ సంస్థ లేవనెత్తింది. ప్రయాణీకుల సమస్యలు పట్టించుకోలేదని, తాము సూచించిన నిబంధనలు పట్టించుకోలేదని, ప్రయాణీకుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ పలు విధాలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే ఉబర్ సర్వీసులు లండన్‌లో నిలిచిపోనున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఉబర్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సీఈవో దారా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులో 'ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలకు ఉద్యమస్థాయిలో సేవలు అందించాం. అదే స్థాయిలో ఎన్నో పొరపాట్లు మావల్ల జరిగాయి. ఇది ముమ్మాటికి నిజం. ఈ సందర్భంగా ప్రతి ఉబర్ వినియోగదారుడికి జరిగిన పొరపాట్లకు క్షమాపణలు చెబుతున్నాను' అంటూ పేర్కొన్నారు. -
ఉబెర్ కొత్త సీఈవో ఎవరంటే..
శాన్ ఫ్రాన్సిస్కో: శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ కంపెనీ కొత్త సీఈవో నియామకం పూర్తి అయింది. ఇటీవలి అంచనాలకు భిన్నంగా అమెరికా ట్రావెల్ కంపెనీ ఎక్స్ పీడియాకు చెందిన దారా ఖోస్రోషాహిని సీఈవోగా ఉబెర్ఎంపిక చేసింది. ఈ ఏడాది జూన్‌లో వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రావిస్ కాలనిక్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ నియామకం జరిగింది. ఆదివారం రాత్రి కంపెనీ జారీ చేసిన ప్రకటన ప్రకారం అనూహ్యంగా రేస్‌లో లేని ఇరాన్ కు చెందిన ఖోస్రోషాహిని కొత్త సీఈవోగా ఎంపిక చేయడం విస్మయపర్చింది. జెఫ్ ఇమ్మెల్ట్, జనరల్ ఎలెక్ట్రిక్ మాజీ సీఈవో, హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ ప్రైజెస్ అధిపతి మెగ్ విట్మన్ ఉబెర్ సీఈవో రేసులో ఉన్నారని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. అయితే బోర్డుతో విబేధాల కారణంగా ఉబెర్‌లో జాయిన్ అయ్యే యోచన లేదని విట్మన్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ కంపెనీగా గుర్తింపు పొందిన ఉబెర్‌లో... పురుషాధిపత్య సంస్కృతి, మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కంపెనీ వాటాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో సీఈవో రాజీనామా చేయక తప్పలేదు. ఉబెర్ మాజీ సైట్ ఇంజనీర్ అయిన సుసాన్ ఫౌలర్ తన సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్ లో తన మాజీ అధికారులపై లైంగిక ఆరోపణల చేయడం వైరల్ అయింది. దీంతో సంస్థ అంతర్గత విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపు, వివక్షత, బెదిరింపు మరియు అనైతిక ప్రవర్తన తదితర 200 ఆరోపణలతో యుబర్ అప్పటికే 20 మంది ఉద్యోగులను తొలగించింది. కాగా 2015నుంచి ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెండవ త్రైమాసికంలో యుబెర్ సేల్స్ గత త్రైమాసికం నుంచి 17 శాతం పెరిగి రెండవ త్రైమాసికంలో 1.75 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.