ప్రముఖ పారిశ్రామిక వేత్త 'గౌతమ్ అదానీ' శనివారం ఉబర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'దారా ఖోస్రోవ్‌షాహి'తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను అదానీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.
భారతదేశంలో గ్రీన్, పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను కూడా వేగవంతం చేయడానికి చేయడానికి, ఉబెర్‌తో భవిష్యత్ సహకారాల కోసం ఈ సమావేశం జరిగింది.
ఫొటోలను షేర్ చేస్తూ.. భారతదేశంలో ఉబర్ విస్తరణకు సంబంధిచి దారా ఖోస్రోవ్‌షాహి విజన్ ప్రశంసించదగ్గదని కొనియాడారు. ప్రత్యేకించి భారతీయ డ్రైవర్ల గౌరవాన్ని పెంచడంలో అతనికున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశారు.
అదానీ గ్రూప్ రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశం యొక్క గ్రీన్ ఎనర్జీ పరివర్తనలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉంది. దేశంలో పునరుత్పాదక ఇంధనంలో ప్రపంచ అగ్రగామిగా నిలువడానికి సంస్థ కృషి చేస్తోంది.
ఇదీ చదవండి: జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!.. మరో యాప్‌లోనే అన్నీ..
ఇక ఉబర్ విషయానికి వస్తే.. ఈ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తమ ఫ్లీట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఉబర్ గ్రీన్ అని పిలువబడే ఈవీ సర్వీస్ ఢిల్లీలో అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో దేశంలోని మరిన్ని నగరాలను ఈ సర్వీస్ విస్తరించనున్నట్లు సమాచారం.
Absolutely captivating chat with @dkhos, CEO of @Uber. His vision for Uber's expansion in India is truly inspiring, especially his commitment to uplifting Indian drivers and their dignity. Excited for future collaborations with Dara and his team! #UberIndia pic.twitter.com/xkHkoNyu5s
— Gautam Adani (@gautam_adani) February 24, 2024
Comments
Please login to add a commentAdd a comment