లండన్ : తమ సర్వీసులను పొందుతున్న ప్రపంచ వినియోగ దారులకు ఉబర్ సీఈవో దారా ఖోస్రోవ్‌షాహి క్షమాపణలు తెలియజేశారు. మున్ముందు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని, తమను తాము చక్కదిద్దుకుంటామని హామీ ఇచ్చారు. లండన్‌లో ఉబర్ తన లైసెన్స్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ లైసెన్స్ రద్దు చేస్తున్న సందర్భంగా పలు విషయాలను లండన్ లైసెన్స్ రెగ్యులారిటీ సంస్థ లేవనెత్తింది. ప్రయాణీకుల సమస్యలు పట్టించుకోలేదని, తాము సూచించిన నిబంధనలు పట్టించుకోలేదని, ప్రయాణీకుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ పలు విధాలుగా పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈ వారంలోనే ఉబర్ సర్వీసులు లండన్‌లో నిలిచిపోనున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఉబర్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సీఈవో దారా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులో 'ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలకు ఉద్యమస్థాయిలో సేవలు అందించాం. అదే స్థాయిలో ఎన్నో పొరపాట్లు మావల్ల జరిగాయి. ఇది ముమ్మాటికి నిజం. ఈ సందర్భంగా ప్రతి ఉబర్ వినియోగదారుడికి జరిగిన పొరపాట్లకు క్షమాపణలు చెబుతున్నాను' అంటూ పేర్కొన్నారు.
అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను
Published Mon, Sep 25 2017 5:45 PM | Last Updated on Thu, Aug 30 2018 9:12 PM
Advertisement
Advertisement