
లండన్ : బ్రిటన్‌లో తన సర్వీసులను కొనసాగించేందుకు ఉబర్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ సంస్ధ బాస్ దారా ఖోస్రోవ్‌షాహి మంగళవారం లండన్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి మైక్ బ్రౌన్‌ను కలవబోతున్నారు. ఈ నెల (సెప్టెంబర్) తర్వాత ఉబర్ తన సర్వీసులు కొనసాగించేందుకు వీల్లేదంటూ లండన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ లైసెన్స్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజల భద్రతను, తాము సూచించిన నిబంధనలను ఖాతరు చేయని కారణంగానే లైసెన్స్‌ను పునరుద్ధరించలేమని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు బహిరంగ క్షమాపణలు చెప్పిన దారా ఆ సమస్యను పరిష్కారం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 'మా కొత్త సీఈవో లండన్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ను వచ్చేవారం కలవనున్నారు. మేం లండన్ అధికారులతో సంప్రదింపులు చేసి తగిన పరిష్కారం కనుగొననున్నారు. లైసెన్స్ తిరిగొస్తుందని నమ్మకముంది' అని ఉబర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఉబర్‌కు 40వేలమంది డ్రైవర్‌లు ఉండటంతోపాటు ఒక్క లండన్‌లోనే 3.5మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.