ఆర్‌బీఐ గవర్నర్‌తో ఆనంద్ మహీంద్రా | Anand Mahindra With RBI Governor Shaktikanta Das | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ గవర్నర్‌తో ఆనంద్ మహీంద్రా

Published Sun, Aug 11 2024 11:05 AM | Last Updated on Sun, Aug 11 2024 12:02 PM

Anand Mahindra With RBI Governor Shaktikanta Das

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఢిల్లీ బోర్డు సమావేశానికి మొదటిసారి హాజరవుతున్నాను. సంసద్ మార్గ్‌లో చాలా అద్భుతమైన, చారిత్రాత్మకమైన ఆర్ట్ డెకో ప్రధాన కార్యాలయ భవనం ఉంది. పాతరోజుల్లో ఇక్కడికి రిటైల్ ట్రాన్సక్షన్స్ కోసం ప్రజలు ఇక్కడికి వచ్చేవారని ఆయన నాతో చెప్పారని ట్వీట్ చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దేశ రాజధానిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశానికి హాజరయ్యారు. 2024-25 కేంద్ర బడ్జెట్ తర్వాత.. లోక్‌సభ ఆర్థిక బిల్లును ఆమోదించిన తర్వాత, ప్రభుత్వం పార్లమెంట్‌లో కొన్ని సవరణలతో సమావేశమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇతర డైరెక్టర్ల బోర్డు పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement