
ఆలయ అధికారులకు డైమండ్ నెక్లెస్‌ను అందజేస్తున్న దాత పూర్ణచంద్రుడు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తుడు బి.పూర్ణచంద్రుడు రూ.2.50 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను కానుకగా అందజేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన పూర్ణచంద్రుడు దంపతులు ఆలయ పర్యవేక్షకులు బలరామ్‌ను కలిసి నెక్లెస్‌ను అందజేశారు.
సుమారు 17 గ్రాముల బంగారం, చిన్న డైమండ్స్‌తో రూపొందించిన ఈ నెక్లెస్‌ను ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించాలని దాతలు కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దాతలతోపాటు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి తదితరులున్నారు. (సప్తగిరులపై ‘స్నో’యగాలు.. కృష్ణమ్మకు ‘ఇంద్ర’హారం)
Comments
Please login to add a commentAdd a comment