
బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకులు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. మరి ఇంత ఘనంగా జరుగుతున్న వేడుకల్లో అంబానీ ఇంటి పెద్ద కోడలు కూడా అదే రేంజ్‌లో ఉండాలిగా.
జామ్ నగర్‌లో 'ఎవర్‌ల్యాండ్‌లో ఈవినింగ్' ధీమ్‌తో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ బాష్‌లో ఆకాష్ అంబానీ సతీమణి శ్లోకా మెహతా భారీ వజ్రాలతో మెరిసిపోయింది. తన ఐకానిక్ ఫ్యాషన్ స్లయిల్‌తో శ్లోకా ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేసింది.
పాప్ సంచలనం రిహన్నగాలా ఈవెంట్, కాక్‌టెయిల్ పార్టీలో ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ వాలెంటినో రెడ్ గౌనులో అందరి చూపులను తన వైపు తిప్పుకుంది. ఫ్లోరల్ క్రాప్ ఆఫ్ షోల్డర్ టాప్‌తో పాటు సీక్విన్డ్ వర్క్ లాంగ్ స్కర్ట్‌తో మోడ్రన్ లుక్‌లో అదర గొట్టేసింది. డైమండ్లు పొదిగిన లేయర్డ్ నెక్లెస్, డైమండ్ స్టడ్ చెవిపోగులు, లేయర్డ్ బ్రాస్లెట్, డైమండ్ రింగ్, అద్భుతమైన డైమండ్ వాచ్‌తో ధగ ధగ లాడిపోయింది. తన ఎటైర్‌లో వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె అని నిరూపించుకుంది.
గతంలో అనంత్-రాధిక మర్చంట్ లగాన్ లఖ్వాను వేడుకలో కూడా శ్లోకా గోల్డెన్ కలర్ లెహంగాలో అందంగా కనిపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment