Varun Tej And Lavanya Tripathi To Get Engaged On June 9th?, News Viral - Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలెక్కనున్న వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి, ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ ఫిక్స్‌!

Published Thu, Jun 1 2023 1:31 PM | Last Updated on Thu, Jun 1 2023 1:47 PM

Varun Tej And Lavanya Tripathi To Get Engaged On June 9th, News Goes Viral - Sakshi

మెగా ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల పెళ్లి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్‌ ప్రేమలో ఉన్నాడని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఇవి కేవలం రూమర్స్‌ మాత్రమేనని కొట్టేశారు. కానీ ఈ మధ్య మళ్ళీ వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అనే వార్త వైరల్ అయింది. ఈ సారి ఇద్దరి నుంచి ఎటువంటి ఖండన రాలేదు. దీంతో వీరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారనని, ఇరు కుటుంబాలు కూడా అందుకు అంగీకరించారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

ముందుగా జూన్‌ 9న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరగనుందట. మెగా ఫ్యామిలీ సభ్యులు, కొంతమంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరగనుందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్‌, లావణ్య విదేశీ పర్యటనలో ఉన్నారు. వరుణ్‌లో రోమ్‌ ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. అలాగే లావణ్య కూడా టూర్‌లో ఉన్నట్లు తెలిపింది. దీంతో వీరిద్దరు కలిసే విదేశీ పర్యటనకు వెళ్లారని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. నేడో,రేపో ఈ జంట హైదరాబాద్‌కు చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement