సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి ఓ ఫ్యామిలీ ధూంధాంగా నిశ్చితార్థం నిర్వహించటంతో 15మంది కరోనా వైరస్ బారిన పడగా ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన దూల్‌పేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. దూల్‌పేటకు చెందిన ఓ ఫ్యామిలీ గత నెల 11న 300 మంది బంధువులు, స్నేహితులతో వైభవంగా నిశ్చితార్థ వేడుకను నిర్వహించింది. దీంతో వేడుకలో పాల్గొన్న వారిపై కరోనా వైరస్ విజృంభించింది. దాదాపు 15 మందికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. పెళ్లికొడుకు తండ్రి కూడా కరోనా బారినపడి మృతి చెందాడు. అధికారులు ఈ వేడుకకు హాజరైన వారి వివరాలను సేకరిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా నిశ్చితార్థం నిర్వహించిన వారిపై చర్యలకు ఉపక్రమించారు.
చదవండి : గ్రేటర్‌లో కరోనా టెన్షన్
Comments
Please login to add a commentAdd a comment