Watch: Delhi Police In Uniform Dance With A Woman Video Goes Viral - Sakshi
Sakshi News home page

యూనిఫామ్‌లో మహిళతో ఎస్సై డ్యాన్స్‌.. వీడియో వైరలవటంతో..!

Published Tue, Dec 20 2022 3:24 PM | Last Updated on Tue, Dec 20 2022 4:46 PM

Video Of Delhi Cop In Uniform Dance With A Woman Goes Viral - Sakshi

న్యూఢిల్లీ: డ్యూటీలో ఉన్న సమయంలో రీల్స్‌, డ్యాన్సులు చేస్తూ వైరల్‌గా మారిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సస్పెండ్‌ అయిన సంఘటనలు చాలానే జరిగాయి. అయినప్పటికీ కొందరిలో ఎలాంటి మార్పు రావటం లేదు. తాము డ్యూటీలో ఉన్నామని, యూనిఫామ్‌లో ఉన్నామనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇలాగే ఓ పోలీసు అధికారి మైమరిచిపోయి మహిళతో చిందులేశారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో చిక్కుల్లో పడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఆ పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. 

నైరుతి ఢిల్లీలోని నారాయణ పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జిగా శ్రీనివాస్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. బంధువుల ఇంట్లో నిశ్చితార్థం వేడుకలకు పోలీసు యూనిఫామ్‌లోనే హాజరయ్యారు. ఈ క్రమంలో తమ బంధువైన ఓ మహిళతో ‘బలామ్‌ థనేందర్‌- నా ప్రేమికుడు పోలీసు’ అనే పాటకు కాలు కదిపారు. మహిళతో పాటు మైమరిచిపోయి డ్యాన్స్‌ చేశారు. మరోవైపు.. కొందరు పోలీసు సిబ్బంది ఆయనపై నోట్ల వర్షం కురిపించారు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. అయితే.. పోలీసు అధికారి సెలవులో ఉన్నారని సమాచారం.

వీడియో వైరల్‌గా మారిన క్రమంలో పోలీసు అధికారిపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసు యూనిఫామ్‌లో డ్యాన్సులు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. స్టేషన్‌ ఇంఛార్జి తీరుపై ఉన్నతాధికారులు సైతం అసహనంతో ఉన్నారనే సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ‘శునకం’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement