ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతా (ఫైల్‌ఫోటో)
దేశీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తమ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాకు త్వరలోనే వివాహం జరిపించబోతున్నారు. జూన్ 30న ఆకాశ్ అంబానీ, శ్లోకాకు అధికారికంగా నిశ్చితార్థపు వేడుకను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ ప్రయాణం మొదలైన రోజు నుంచి ఆకాశ్ - శ్లోకా ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోన్నాయి. అయితే ఇంతకూ ఆకాశ్ శ్లోకాకు ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా...?
ఆకాశ్ - శ్లోకా ఇద్దరూ చిన్ననాటి స్నేహితులనే సంగతి తెలిసిందే. అయితే గత మార్చి 24న ఆ స్నేహబంధం కాస్తా ప్రేమ బంధంగా మారింది. మార్చి 24న గోవాలో నిర్వహించిన ఒక ప్రైవేట్ పార్టీకి ముఖేశ్ అంబాని, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్‌తో పాటు మరికొందరు దగ్గరి స్నేహితులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో...సూర్యుడు అస్తమిస్తుండగా...తన మనసులో ఉదయించిన ప్రేమను ఆకాశ్ తన చిన్న నాటి నేస్తం శ్లోకాకు తెలియజేసాడు. ఆ తర్వాత ఇంకేముంది...శ్లోకాతోపాటు కుటుంబసభ్యులు కూడా ఒప్పుకోవడం...పార్టీ చేసుకోవడం అంతా మాయాలా జరిగిపోయాయంటున్నాడు ఆకాశ్.
అన్నట్లు ఆ సమయంలో శ్లోకా కుంటుంబం కూడా అక్కడే ఉంది. ఈ నెల 30న ఆకాశ్ - శ్లోకాల నిశ్చితార్థపు వేడుక అంబానీల నివాసం అంటిల్లాలో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment