ముంబై : దేశీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తమ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాకు త్వరలోనే వివాహం జరిపించబోతున్నారు. వీరి పెళ్లితో పాటు, అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నిశ్చయమైపోయింది. దీంతో అంబానీ కుటుంబమంతా పెళ్లి పనులతో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆకాశ్ అంబానీ, శ్లోకాకు జూన్ 30న అధికారికంగా నిశ్చితార్థపు వేడుకను నిర్వహించబోతున్నారు. అంబానీ రెసిడెన్సీలోని అంటిల్లాలో ఈ వేడుక జరుగబోతుంది.
ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలందరూ కదలి రాబోతున్నారు. బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్ షారుఖ్, ఆకాశ్, శ్లోకాల నిశ్చితార్థపు వేడుకకు హోస్ట్‌గా నిర్వహించబోతున్నారని అంబానీ సన్నిహిత వర్గాలు చెప్పాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు రాబోతున్న ఈ ఈవెంట్‌కు, కింగ్ ఖాన్‌ను మించిన హోస్ట్ మరెవరూ ఉండరని పలువురంటున్నారు. బాలీవుడ్‌లోని ఫ్రెండ్స్‌తో కలిసి, ఈ కపుల్ స్టేజీపై చిందులు కూడా వేయబోతున్నారట.
కాగ, ఈ ఏడాది మార్చి 24న రోజి బ్లూ డైమాండ్స్ రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకాకు ఆకాశ్ లవ్ ప్రపోజ్ చేయడం, ఆమె అంగీకరించడం జరిగింది. ఆ అనంతరం అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చింది. శ్లోకా, ఆకాశ్‌లు చిన్ననాటి స్నేహితులు. రస్సెల్, మోనా మెహతాలకు శ్లోకా చిన్న కూతురు.
Comments
Please login to add a commentAdd a comment