
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై పలు షోస్‌లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటీ కాబోతున్నారు. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సుజాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది.
తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. రాకేశ్‌తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలను వీడియోలో షేర్ చేసుకుంది. ఈనెల చివర్లోనే తమ నిశ్చితార్థం ఉండనుందని, త్వరలోనే పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ జంటకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment