తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది జోర్దార్ సుజాత. బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇటీవలె రాకింగ్ రాకేశ్ అనే కమెడియన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరి లవ్ ట్రాక్ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ నడుస్తుంది. ఇప్పటికే తమ ప్రేమ గురించి బహిరంగంగానే మాట్లాడిన ఈ జోడీ తాజాగా మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. ఓ షోపై వీరి జంట సందడి చేసింది.
ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. తమది ప్రమోషన్ కోసం పుట్టిన ప్రేమ కాదు.. షో కోసం చేసే షో కాదు.. జీవితాంతం కలిసుండే ప్రేమ అంటూ స్టేజీ మీద అందరి ముందే చెప్పేశాడు. రాకేశ్ మాటలకు ఫిదా అయిన సుజాత స్టేజ్‌పైనే అతడిని కౌగిలించుకొని ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment