బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ జోర్దార్ సుజాత.. కమెడియన్ రాకింగ్ రాకేశ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే! ఇటీవలే వీరు ఎంగేజ్‌మెంట్ కోసం షాపింగ్ కూడా చేశారు. ఆ వీడియోను సుజాత తన యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేసింది. ఇకపోతే నిశ్చితార్థానికి బంధుమిత్రులను పిలిచేందుకు రెడీ అయిందీ జంట. తాజాగా ప్రముఖ నటి, మంత్రి రోజాకు తమ పెళ్లి వార్త చెబుదామని ఆమె ఇంటికి వెళ్లారు. అయితే రోజా ఏదో మీటింగ్‌లో ఉండటంతో రాకేశ్ ఆలస్యం చేయకుండా వంటిట్లో దూరాడు.
తనే స్వయంగా ఆలూ ఫ్రై వండాడు. రోజా ఇంటికి రాగానే ఆమెకు స్వయంగా వడ్డించాడు. విందు అనంతరం రోజా కాబోయే పెళ్లికూతురు సుజాతకు పట్టుచీర పెట్టారు. ఆ తర్వాత ఆ జంటను తన కారులో తిరుపతి కొండకు తీసుకెళ్లారు. 'మేడమ్ మమ్మల్ని వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం దగ్గరుండి తిరుపతి కొండకు తీసుకెళ్లడం ఎన్నో జన్మల అదృష్టం' అంటూ మురిసిపోయాడు రాకేశ్. ఇక ఈ వీడియోను చంటబ్బాయ్ యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment