Mehreen Pirzada Engagement Photos: భవ్యతో ఘనంగా హీరోయిన్‌ మెహ్రీన్‌ నిశ్చితార్థం - Sakshi
Sakshi News home page

భవ్యతో ఘనంగా హీరోయిన్‌ మెహ్రీన్‌ నిశ్చితార్థం

Published Sat, Mar 13 2021 12:25 AM | Last Updated on Sat, Mar 13 2021 11:00 AM

Mehreen Pirzada Gets Engaged To Bhavya Bishnoi - Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాజీ ముఖ్యమంత్రి మనువడికి రింగ్‌ పెట్టేసింది. మధ్యప్రదేశ్‌ జైపూర్‌లోని అలీలా కోటలో శుక్రవారం మెహ్రీన్‌ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఆమెకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడే భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

దీనికి సంబంధించిన ఫొటోలను మెహ్రీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. నిశ్చితార్థ వేడుకలో భాగంగా భవ్య బిష్ణోయ్‌తో కలిసి మెహ్రీన్‌ పూజలు చేసింది. అనంతరం వీరిరువురు రింగులు మార్చుకున్నారని తెలుస్తోంది. హరియాణా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ బిష్ణోయ్ పని చేశారు. మూడు పర్యాయాలు ఆయన సీఎంగా ఉన్నారు. అతడి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. వీరిది హరియాణాలో రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలస్‌ వేదిక కానుంది. ఎఫ్ 2, కవచం సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎఫ్‌ 3 సినిమాతో బిజీగా ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement