Niharika Konidela's Engagement: Stylish Star Allu Arjun, and Wife Sneha Reddy's Photos Viral | నిహారిక నిశ్చితార్థంలో స్టైలిష్‌ స్టార్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా - Sakshi
Sakshi News home page

నిహారిక నిశ్చితార్థంలో స్టైలిష్‌ స్టార్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా

Published Fri, Aug 14 2020 4:03 PM | Last Updated on Fri, Aug 14 2020 8:49 PM

Allu Arjun Couple Pics From Niharika Konidela Engagement - Sakshi

కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక - చైత‌న్యల‌ నిశ్చితార్థం  గురువారం రాత్రి హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది సన్నిహితుల స‌మ‌క్షంలో చాలా ఆడంబరంగా ఈ వేడుక జరిగింది. ఫంక్షన్‌కి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్‌ స‌తీస‌మేతంగా హాజ‌రు కాగా.. సాయి ధ‌ర‌మ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్‌, శ్రీజ‌,సుస్మిత‌, క‌ళ్యాణ్ దేవ్‌, వ‌రుణ్ తేజ్ త‌దిత‌రులు సందడి చేశారు. (భావోద్వేగానికి లోనయిన అల్లు అర్జున్‌)
 

ఈ వేడుక‌లో అల్లు అర్జున్ త‌న సతీమ‌ణి స్నేహా రెడ్డితో క‌లిసి స్టైలిష్ లుక్‌లో మెరవ‌డంతో పాటు ఫంక్షన్‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. బన్నీ స్టైలిస్ట్‌  హర్మాన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. అల్లు అర్జున్‌, స్నేహ ఇద్దరు మనీష్ మల్హోత్రా డిజైన్‌ చేసి దుస్తులు ధరించి వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో బ‌న్నీని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘ఈ జంట ఫ్యాషన్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు’.. ‘అల్లు అర్జున్‌కు భార్య స్నేహ మీద ఉన్న ప్రేమను చూసి.. జనాలు వారితో ప్రేమలో పడుతున్నారు’.. ‘మేడ్‌ ఫర్‌ ఇచ్‌ అదర్‌’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుం బన్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఇప్ప‌టికే విడుద‌లవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement