Megastar Chiranjeevi Attended YSRCP MP Balasouri Son Engagement Function - Sakshi
Sakshi News home page

ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుడి నిశ్చితార్థం.. హాజరైన చిరంజీవి

Published Tue, Aug 31 2021 8:00 AM | Last Updated on Tue, Aug 31 2021 10:00 AM

Chiranjeevi Attended YSRCP MP Balasouri son Engagement In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్‌ వివాహ నిశ్చితార్థం స్నికితతో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సోమవారం హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు పాల్గొని కాబోయే  వధువరులను ఆశీర్వదించారు. టాలీవుడ్‌ మెగా స్టార్‌ చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. కాబోయే వధూవరులకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలనుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని నూతన జంటకు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మేకతోటి సుచరిత, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు నటులు కైకాల సత్యనారయణ, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఎస్‌.గోపాల్‌రెడ్డి, రమేశ్‌వర్మ, సంగీత దర్శకులు కోటి, టాలీవుడ్‌ రచయిత బుర్రా సాయిమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement