ఉచితంగా ఇంగ్లిష్‌ నైపుణ్యాలు : ఈజీగా స్పొకెన్‌ ఇంగ్లీష్‌ | Opportunity To Learn English For Free Of 'Medha Institute' | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఇంగ్లిష్‌ నైపుణ్యాలు : ఈజీగా స్పొకెన్‌ ఇంగ్లీష్‌

Published Sat, Apr 6 2024 12:29 PM | Last Updated on Sat, Apr 6 2024 1:14 PM

Opportunity To Learn English For Free Of 'Medha Institute' - Sakshi

ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు

‘మేధా ఇన్‌స్టిట్యూట్‌’ ఫౌండర్‌ చిరంజీవి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధికి తప్పనిసరి అర్హతగా మారుతున్న ఇంగ్లీషులో మరింత మంది నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని ‘మేధా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌’ వ్యవస్థాపకుడు, చీఫ్‌ కోచ్‌ డాక్టర్‌ ఏ. చిరంజీవి అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏ రంగంలోనైనా ఇంగ్లిష్‌పై పట్టున్న వారికే అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో ప్రాథమిక విద్య నుంచీ ఇంగ్లీషు మీడియాన్ని అందుబాటులోకి తేవటం చాలా ప్రశంసనీయమన్నారు. రేపటి తరం పిల్లలంతా ఇంగ్లీషు విద్యను అభ్యసిస్తున్నారు కనక.. వారితో మ్యాచ్‌ కావాల్సిన నిన్నటితరం పెద్దలు, ఇంగ్లీషు భాషా నైపుణ్య లోపాల కారణంగా మెరుగైన అవకాశాలు అందుకోలేని యువత.. వీరందరి కోసం తమ సంస్థ ఉచితంగా ఇంగ్లీషు స్పీకింగ్‌ కోర్సును అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.

‘‘ఇంగ్లీషు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికోసం ‘మేధా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌’ సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మా ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసి 30 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈజీ ఇంగ్లీష్‌ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆన్‌లైన్లో ఉచితంగా అందజేస్తాం’‘ అని చిరంజీవి తెలియజేశారు. ఈజీ ఇంగ్లీష్‌ ద్వారా రాష్ట్రంలోని యువతకు కేవలం స్పోకెన్‌ ఇంగ్లీష్ మాత్రమే కాకుండా దాదాపు 9 రకాల అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు.

ఉచితంగా.. అందరికీ ‘‘మేధా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ను 1994లో ప్రారంభించాం. విశాఖపట్నంలో ఆరంభించి తెలుగు రాష్ట్రాల్లో 18 శాఖలుగా విస్తరించాం. ప్రస్తుతం ఆన్‌లైన్‌ మాడ్యూల్స్‌పై ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నాం. మా సంస్థకు 30 ఏళ్లయిన సందర్భంగా అందిస్తున్న ఉచిత ఇంగ్లిష్‌ నైపుణ్య కోర్సుకు ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ కోసం దిగువ ఇచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకుంటే చాలు. వారి మొబైల్‌కు రిజిస్ట్రేషన్‌ లింకు వస్తుంది. లేనిపక్షంలో 9866006662 ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా వివరాలు పంపినా వారి మొబైల్‌ ఫోన్‌కు లింకును పంపిస్తాం".

అదే విధంగా పది అంశాల్లో శిక్షణ.. "ఈజీ ఇంగ్లీష్‌ ద్వారా స్పొకెన్‌ ఇంగ్లీష్‌ తరగతులే కాకుండా కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గోల్‌ సెట్టింగ్, పాజిటివ్‌ మెంటల్‌ ఆటిట్యూడ్, పబ్లిక్‌ రిలేషన్స్, స్ట్రెస్‌ మేనేజ్మెంట్, టైమ్‌ మేనేజ్మెంట్, మైండ్‌ మేనేజ్మెంట్, లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌పై శిక్షణ ఇస్తాం. ప్రతి రోజు శిక్షణ ముగిసిన తర్వాత పరీక్ష పెట్టడంతో పాటు స్టడీ మెటీరియల్‌నూ ఇస్తాం. ఈ కార్యక్రమాలను ఆన్‌లైన్‌ పద్దతిలో లైవ్‌లో అందిస్తాం. అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభిస్తాం. ఈ శిక్షణ కోసం మేధా ఇన్‌స్టిట్యూట్‌ తరపున 30 మంది నిపుణుల బృందం పనిచేస్తుంది. లైవ్‌లో నిర్వహించే ఈ తరగతులపై ఏవైనా సందేహాలుంటే చాట్‌ ద్వారా జవాబులిస్తాం’’ అని చిరంజీవి తెలిపారు.

ఇవి చదవండి: వారెవ్వా.. నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement