సీఎస్‌కే స్టార్ పేసర్ తుషార్‌దేశ్ పాండే త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ ఫ్రెండ్ నభా గడ్డంవార్‌తో సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు పలువురు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు హాజరయ్యారు.
తుషార్, నభా ఎంగేజ్‌మెంట్ ఫొటోను సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూల్ డేస్ నుంచి తుషార్, నభాకు మధ్య పరిచయం ఉందట. నభాతో ఎంగేజ్‌మెంట్ గురించి తుషార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.
స్కూల్ క్రష్ నుంచి తన భార్యగా నభా ప్రమోషన్ పొందనుందని పేర్కొన్నాడు. కొత్త జంటకు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాలు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను తుషార్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
కాగా రూ. 20 లక్షల బేస్ ధరకు తుషార్ దేశ్‌పాండే ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. తనకు ధరకు పదింతల న్యాయం చేశాడు తుషార్. అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన తుషార్ ధోని నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఒకానొక దశలో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. అద్భుత బౌలింగ్‌తో చెన్నై కప్ గెలవడంతో తుషార్ దేవ్‌పాండే తన వంతు పాత్రను పోషించాడు. గత సీజన్‌లో పెద్దగా అవకాశాలు రాకా బెంచ్‌కు పరిమితమైన తుషార్ ఈ సీజన్‌లో మాత్రం చెలరేగిపోయాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment