ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా నిశ్చితార్థపు వేడుక
ముంబై : అంబానీ ఫ్యామిలీలో ఏది జరిగినా స్పెషలే. ఇక కూతురు, కొడుకుల వివాహమంటే ఏ రేంజ్‌లో జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదిక వేసి అంగరంగ వైభవంగా.. అతిథులకు కళ్లు జిగ్గేల్లామనేలా ఆనందంలో ముంచేస్తుంది. ఇటీవలే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ వివాహం, తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతతో నిశ్చియమైంది. ఆకాశ్‌తో పాటు అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో జరుగబోతోంది. వీరి వివాహాలను ధృవీకరించిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఇప్పటికే గ్రాండ్‌గా పార్టీలు కూడా చేసింది.
తాజాగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల ఎంగేజ్‌మెంట్‌ను అంబానీ ఫ్యామిలీ అధికారికంగా చేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఈ నిశ్చితార్థపు వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రిక వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని అంబానీ ఫ్యామిలీ ఎంతో అట్టహాసంగా రూపొందించింది. జూన్ 30న శనివారం ముంబైలోని 39 అట్లామౌంట్ రోడ్‌లో నిశ్చితార్థపు వేడుక ఉంటుందని, తమ ప్రియమైన వారందరూ హాజరుకావాలంటూ అంబానీ ఫ్యామిలీ తన కొడుకు నిశ్చితార్థానికి ఆహ్వానిస్తోంది. ఆకాశ్, శ్లోకాల వివాహం చేయాలని నిర్ణయించిన అనంతరం, బాలీవుడ్ నటీనటులకు, సెలబ్రిటీలకు, ఆకాశ్, శ్లోకాల స్నేహితులకు ముఖేష్ అంబానీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. తాజాగా నిశ్చితార్థాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలోనే పెళ్లి తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. డైమాండ్ వ్యాపారి రస్సెల్, మోనా మెహతాల కూతురే శ్లోకా మెహతా. ఆకాశ్, శ్లోకాలు ఎంతో కాలంగా స్నేహితులు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment