ఎంగేజ్డ్‌ | Nithin-Shalini engagement ceremony | Sakshi
Sakshi News home page

ఎంగేజ్డ్‌

Jul 23 2020 12:47 AM | Updated on Jul 23 2020 12:47 AM

Nithin-Shalini engagement ceremony - Sakshi

నితిన్, షాలినీ

హీరో నితిన్‌ వివాహం షాలినీతో నిశ్చయమయిన సంగతి తెలిసిందే. బుధవారం నితిన్‌ ఇంట్లో జరిగిన నిశ్చితార్థం వేడుక జరిగింది. ‘ఎంగేజ్డ్‌’ అంటూ నితిన్‌ తన నిశ్చితార్థం ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. నితిన్‌ క్రీమ్‌ కలర్‌ కుర్తా, పైజమాలో హ్యాండ్‌సమ్‌గా కనిపించగా, షాలిని ఎరుపు రంగు పట్టుచీరలో మెరిసిపోయారు. వీరి వివాహ వేడుక ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్‌నామా ప్యాలెస్‌లో జరగనుంది. వాస్తవానికి వీరి వివాహాన్ని భారీ ఎత్తున ప్లాన్‌చేశారు, కానీ కరోనా కారణంగా సాధ్యపడలేదు. అతికొద్దిమంది బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement