personal details
-
ఈపీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలు మార్చుకోండిలా..!
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు శుభవార్త! మీ పీఎఫ్ ఖాతాలో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు..వంటి కీలక వివరాలు తప్పుగా ఉన్నాయా? అయితే ఇకపై వాటిని సవరించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనికోసం జాయింట్ డిక్లరేషన్‌ను మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు.ఏమిటీ జాయింట్ డిక్లరేషన్..ఈపీఎఫ్ చందాదారులు తమ వ్యక్తిగత వివరాలు మార్చాలనుకుంటే జాయింట్ డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రిలేషన్, వైవాహిక స్థితి, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, రీజన్ ఫర్ లీవింగ్, నేషనాలిటీ, ఆధార్ నంబర్.. వంటి 11 రకాల వివరాలు ఇందులో మార్చుకోవచ్చు. అయితే ఈ వివరాలను మార్చాలంటే చందాదారుడు, సంస్థ యజమాని ఇద్దరూ ఈ మార్పును ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ ఆన్లైన్నే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డిక్లరేషన్ ఫారాన్ని పీఎఫ్ కమిషనర్‌కి పంపించాలి. దాని అనుసరించి చందాదారుల వివరాలు అప్డేట్ అవుతాయి.సవరణ ఇలా..చందాదారులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ epfindia.gov.inకు వెళ్లాలి.హోం పేజీ టాప్‌లో ఎడమవైపు servicesపై క్లిక్ చేయాలి.For Employees అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.కిందకు స్క్రోల్ చేసి సర్వీసెస్ సెక్షన్లో Member UAN/ online Service(OCS/OTCP)పై క్లిక్ చేయాలి.కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్వర్డ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.స్క్రీన్‌పై కనిపించే Manage ఆప్షన్‌ను ఎంచుకోగానే అందులో joint declaration ఆప్షన్ కనిపిస్తుంది.ఇదీ చదవండి: బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్!మీ మెంబర్ ఐడీని ఎంటర్ చేసి అప్డేట్ చేయాలనుకుంటున్న వివరాలను తెలపాలి. సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.వివరాలు సబ్మిట్ చేశాక యజమానికి (ఎంప్లాయర్) లాగిన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు కూడా వెళ్తాయి.ఎంప్లాయర్ కూడా ఆయా వివరాలను ధ్రువీకరించిన తర్వాత సదరు జాయింట్ డిక్లరేషన్‌ను పీఎఫ్ కమిషనర్‌కు పంపించాలి. -
Lok sabha elections 2024: కుమారస్వామి ఆస్తులు రూ.217 కోట్లు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, ఆయన భార్య అనిత మొత్తం రూ.217.21 కోట్ల ఆస్తులున్నాయి. మాండ్య లోక్‌సభ స్థానానికి గురువారం కుమారస్వామి నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడివిట్లో తన వ్యక్తిగత వివరాలను పొందుపరిచారు. తమకు రూ.82.17 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కుమారస్వామికి రూ.54.65 కోట్ల విలువైన ఆస్తులుండగా ఆయన భార్య అనితకు రూ.154.39 కోట్ల ఆస్తులున్నాయి. తమ ఉమ్మడి కుటుంబంలో తన పేరిట మరో రూ.8.17 కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్లు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి వెల్లడించారు. -
క్యాబ్‌లో ఏం మాట్లాడుతున్నారు? డ్రైవర్‌కు దుర్భుద్ధి పుడితే ఎలా?
క్యాబ్‌లో ఎక్కాక చేతులు ఊరికే ఉండవు. ఫోన్ తీసి కబుర్లు చెప్పమంటాయి. కాని కబుర్లు మరీ పర్సనల్ అయినప్పుడు, అవి విన్న డ్రైవర్‌కు దుర్బుద్ధి పుడితే నరకం అనుభవించాల్సి ఉంటుంది. బెంగళూరులో క్యాబ్ ఎక్కిన మహిళ ఫోన్లో చేసిన పర్సనల్ టాక్‌ను విన్న డ్రైవర్ ఆమెను ఏడు నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 40 లక్షలు గుంజాడు. అనుకోకుండా దొరికాడు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో! ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? స్త్రీలు విధులు, ఉపాధికి బయటకు వెళ్లక తప్పదు. ఇప్పుడున్న ప్రయివేటు రవాణా యాప్‌లను నమ్ముకోకా తప్పదు. ఇలాంటి యాప్‌లలో పని చేసే డ్రయివర్లు నూటికి తొంభై తొమ్మిది మంది తమ బతుకు తెరువు కోసం పని చేస్తున్నా ఒకరిద్దరు ప్రమాదకరంగా మారుతున్నారు. ఇటీవల బెంగళూరులో ఒక మహిళ టూ వీలర్ బుక్ చేసుకుంటే ఆమెను వెనుక కూచోబెట్టుకున్న డ్రైవర్ ఆమె చూసేలా తన శరీరాన్ని తాను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఆమె మధ్యలో బైక్ మీద నుంచి దూకేయాల్సి వచ్చింది. ఇప్పుడు వెలికి వచ్చిన మరో ఘటన ఒంటరి స్త్రీలు ఎంత జాగ్రత్తగా క్యాబ్ లేదా టూ వీలర్ వ్యవస్థను ఉపయోగించుకోవాలో తెలుపుతోంది. అసలేం జరిగింది? ఇది నవంబర్ 2022లో జరిగింది. బెంగుళూరులో ఒక వివాహిత క్యాబ్ మాట్లాడుకుని ఇంటినుంచి బయలుదేరింది. క్యాబ్‌లో వెనుక సీట్లో కూచుని ఫోన్ తీసి మిత్రుడితో మాట్లాడసాగింది. అప్పటికే డిప్రెషన్లో ఉన్న ఆమె తన మిత్రుడితో ఇంటి సమస్యలు చెప్పుకుని, త్వరలో విడాకులు తీసుకుందామనుకుంటున్న ఆలోచన చెప్పి, మిత్రునితో సాన్నిహిత్యపు మాటలు మాట్లాడింది. తను క్యాబ్‌లో ఉన్నానని ఇంకో వ్యక్తి ఆ మాటలు వింటున్నాడని మర్చిపోవడం ఆమె తప్పు. ఈ మాటలన్నీ విన్న క్యాబ్ డ్రైవర్ ఆమెను గమ్యంలో దింపి సోషల్ మీడియా ద్వారా ఆమెనూ ఆమె భర్తనూ గుర్తించాడు. తర్వాత ఆమెకు కాల్ చేసి ఆ రోజు తాను విన్న సంగతంతా భర్తకు చెప్పేస్తానని, మరో పురుషుడితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావని చెప్పేస్తానని బెదిరించాడు. ఆ వివాహిత హడలిపోయింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక భయపడిపోయింది. దాంతో క్యాబ్ డ్రైవర్ ఆమె నుంచి గత ఏడు నెలలుగా డబ్బు గుంజడం మొదలెట్టాడు. ఆమె తన దగ్గరున్న 20 లక్షల రూపాయలు అతనికి సమర్పించింది. అయినప్పటికీ ఆశ చావక వేధిస్తుండటంతో తల్లిగారి ఇంటికి వెళ్లి తల్లికి చెందిన 20 లక్షల విలువైన నగలు తెచ్చి ఇచ్చింది. పరువు మర్యాదలు ఎలా కాపాడుకోవాలో తెలియక, మరోవైపు ఈ క్యాబ్ డ్రైవర్ పెడుతున్న నరకం నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక సతమతమైంది. ఇంత జరుగుతున్నా ఆమె ఈ విషయాన్ని భర్తకు కాని, పోలీసులకు కాని తెలిపే ధైర్యం చేయలేదు. అయినప్పటికీ దుర్మార్గుడు దొరికాడు. జాగ్రత్త... మాటలు వింటారు మీ మాటలు, చాటింగ్ ప్రతిదీ అపరిచితుల కంట పడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం స్త్రీలకు ఉంది. అపరిచితుల ఎదుట ఫోన్లలో పర్సనల్ విషయాలు మాట్లాడకపోవడం, ఇంట్లో ఒంటరిగా ఉంటుంటే గనక అలాంటి వివరాలు చెప్పకపోవడం, ఏ సమయంలో ఎక్కడ ఉండేది చెప్పకపోవడం చాలా ముఖ్యం. అలాగే ఫోన్ క్యాబ్‌లో వదిలి ఏదైనా కొనడానికి కిందకు దిగకూడదు. పిల్లల స్కూల్ టైమింగ్స్, డ్రాపింగ్ పికప్ వంటి విషయాలు ఫోన్లో డ్రైవర్ వినేలా చెప్పకూడదు. డబ్బు విషయాలు కూడా. అలాగే డ్రైవర్‌తో కాలక్షేపం కబుర్లు కూడా మంచివి కావు. ఏ క్యాబ్ డ్రైవర్ అయినా ఏ కొంచెం ఇబ్బంది పెట్టినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి. ఎందుకంటే మన వ్యక్తిగత సమస్యలను కుటుంబం అర్థం చేసుకుంటుంది. వాటిని అడ్డు పెట్టి ఎవరూ బ్లాక్మెయిల్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ... ముఖ్యంగా స్త్రీలది. తస్మాత్ జాగ్రత్త! ఎలా దొరికాడు? జూలై 24న బెంగళూరులోని రామ్మూర్తి నగర్లో ఒక క్యాబ్ ఆగి అందులో కొందరు పార్టీ చేసుకుంటున్నారని పోలీసులు గమనించారు. రాత్రిపూట అలా క్యాబ్‌లో పార్టీ చేసుకోవడం సరికాదని హెచ్చరించి వెళ్లిపోయారు. అయితే వెళుతూ ఉండగా ఎస్.ఐకి అనుమానం వచ్చింది. క్యాబ్‌లో ఉన్నది డ్రైవర్ స్థాయి మనుషులు. వారు తాగుతున్నది గ్లెన్లివట్ విస్కీ. ఆ బాటిల్ ధర బెంగళూరులో 9,900. అంత ఖరీదైన బాటిల్ ఎక్కడిదని డ్రైవర్ని పేరడిగితే ‘ప్రవీణ్’ అని చెప్పాడు. ఐడి కార్డులో కిరణ్ అని ఉంది. దాంతో పోలీసులకు పూర్తిగా అనుమానం వచ్చింది. ఆ క్యాబ్‌కు డ్రైవర్ అతడే. మిగిలినవారు స్నేహితులు. కిరణ్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తగు మర్యాదలు చేశాక మొత్తం కక్కాడు. పోలీసులు అవాక్కయ్యి ఆ వివాహితను, ఆమె భర్తను కలిసి విషయం చెప్పారు. అయినప్పటికీ వారు కేసు పెట్టడానికి సంశయిస్తే బాధితుల పేర్లు బయటకు రాకుండా చూస్తామని హామీ ఇచ్చి కేసు పెట్టించారు. వెంటనే కిరణ్‌ని అరెస్ట్ చేశారు. కుదువ పెట్టిన నగలన్నీ బయటకు తెచ్చారు. డబ్బు మాత్రం అతడు బెట్టింగ్‌లో ఖర్చు పెట్టేశాడు. -
ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోండి.. రేపే లాస్ట్ డేట్!
ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా ఆధార్ కార్డ్‌లోని వివరాల్ని అప్డేట్ చేసుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (uidai) ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. యూఐడీఏఐ ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘మై ఆధార్’ను సందర్శించాల్సి ఉంటుంది. యూఐడీఏఐ ట్వీట్ మేరకు.. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకొని పదేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలైందా? అయితే మార్చి 15 నుంచి జూన్ 14, 2023 వరకు ఉచితంగా https://myaadhaar.uidai.gov.inలో ఐడెంటిటీ ఫ్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలని ట్వీట్ చేసింది. దీంతో యూఐడీఏఐ ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. గడువు అనంతరం యధావిధిగా డబ్బులు చెల్లించి ఆధార్‌ను ఆప్డేట్ చేసుకోవచ్చు. Keep Demographic Details Updated to Strengthen Your #Aadhaar. If your Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at https://t.co/CbzsDIBUbs ‘FREE OF COST’ from 15 March - June 14, 2023. pic.twitter.com/CFsKqPc2dm — Aadhaar (@UIDAI) March 16, 2023 అడ్రస్ ఫ్రూప్‌ను అప్డేట్ చేసుకోండిలా స్టెప్1 : https://myaadhaar.uidai.gov.inను విజిట్ చేయండి స్టెప్2 : అందులో లాగిన్ అయిన తర్వాత ‘నేమ్/జెండర్/డేట్ ఆఫ్ బర్త్& ఆధార్ అడ్రస్’ స్టెప్3 : అనంతరం అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి స్టెప్4 : అడ్రస్‌ను సెలక్ట్ చేసుకొని మీ ఇంటిపేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇలా (డెమోగ్రాఫిక్స్ ఆప్షన్) వివరాల్ని పొందుపరచాలి. అనంతరం ప్రొసీడ్ టూ అప్డేట్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. స్టెప్5 : డెమో గ్రాఫిక్స్ ఇన్ఫర్మేషన్ వివరాల్ని ఇవ్వాలి. అనంతరం కావాల్సిన కాపీలను స్కాన్ చేయాలి. స్టెప్6 : కాపీలను స్కాన్ చేసి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ (ఎస్ఆర్ఎన్) జనరేట్ అవుతుంది. సేవ్ చేస్తే మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ ట్రాక్ చేసుకునే వీలు కలుగుతుంది. ఇదీ చదవండి : ‘వెన్న తెచ్చిన తంటా’, ఉద్యోగుల తొలగింపు.. స్టార్టప్ మూసివేత! -
ఈ–కామర్స్ సైట్ల నుంచే డేటా లీక్.. ఇంటి దొంగల పనే ఇదంతా..!
ఈ రోజుల్లో సరుకులు, కూరగాయల నుంచి దుస్తుల వరకూ ప్రతీది ఆన్లైన్లో కొనేయడం అలవాటైపోయింది. అయితే ఆన్లైన్ షాపింగ్‌లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయింది. కస్టమర్ల పేరు, చిరునామా, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, కొనుగోలు చేసిన వస్తువులు.. ఇలా ప్రతీ ఒక్కటీ బహిరంగ మార్కెట్లోకి అలవోకగా వచ్చేస్తున్నాయి. భద్రంగా ఉండాల్సిన కస్టమర్ల వ్యక్తిగత వివరాలు అంగట్లో సరుకులుగా విక్రయిస్తున్నట్లు ఇటీవలసైబరాబాద్ పోలీసులు డేటాలీక్, విక్రయం కేసు విచారణలో గుర్తించారు. అమెజాన్, బిగ్‌బాస్కెట్, జొమాటో వంటి పదుల సంఖ్యలోని ఈ–కామర్స్ సైట్లలోని కస్టమర్ల డేటాను నేరస్తులు అమ్మకానికి పెట్టారు. – సాక్షి, హైదరాబాద్ ఇంటి దొంగల పనే.. ఆయా ఈ–కామర్స్ వెబ్సైట్లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు సైబర్ నేరగాళ్లు డబ్బులు చెల్లించి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆర్డర్ చేసిన వస్తువులతోపాటు కస్టమర్ల డేటా కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలో డేటాను డెలివరీ పాయింట్స్ నుంచి సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత టెలికాలర్స్తో కస్టమర్లకు ఫోన్ చేయిస్తున్నారు. ఫలానా సైట్ ద్వారా మీరు వస్తువు కొనుగోలు చేశారు.. కంపెనీ తీసిన లక్కీడీప్‌లో మీరు ఖరీదైన కారు, అందుకు సమానమైన నగదు బహుమతి గెలుచుకున్నారంటూ ఫోన్లో నమ్మిస్తున్నారు. జీఎస్టీ, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ ఇలా రకరకాల చార్జీలు చెల్లించాలని, అవన్నీ తిరిగి రీఫండ్ చేస్తామంటూ బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కాజేసి ఫోన్లు స్విచాఫ్ చేస్తున్నారు. ఇలా సైబర్ నేరస్తులు దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అప్రమత్తత అవసరం నిందితులు విక్రయానికి పెట్టిన వాటిలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్‌పే, బిగ్ బాస్కెట్, బుక్‌మై షో, ఇన్‌స్ట్రాగామ్, జొమాటో, పాలసీ బజార్, ఓఎల్ఎక్స్, బైజూస్, వేదాంతు వంటి సంస్థల వినియోగదారుల డేటా కూడా ఉంది. యూజర్ల సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ (ఎస్పీడీఐ)ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఈ–కామర్స్ సంస్థలదే. కానీ, ఆయా సంస్థలు ఐటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో వ్యక్తిగత వివరాల నమోదు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు.. ఫ్రెండ్స్ ఇళ్లలోనే ఉంటా - ఎలన్ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంచలన విషయాలు చెప్పారు. ఇప్పటికీ తనకు సొంత ఇళ్లు లేదంటూ టెడ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దాదాపు ఆర్నెళ్లుగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలన్మస్క కొనసాగుతున్నాడు. కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. పేపాల్‌తో మొదలైన అతని వ్యాపార సామ్రాజ్యం టెస్లాతో ఊహించని స్థాయికి చేరింది. తాజాగా స్పేస్ఎక్స్తో భవిష్యత్తులో కూడా తనను ఎవరూ టచ్ చేయలేనంతగా సంపదను పోగేసుకోబోతున్నాడు. ఇటీవల రెండు బిలియన్ డాలర్ల సొమ్ముతో ట్విటర్లో మేజర్ షేర్ హోల్డర్‌గా మారాడు. అంతేకాదు ఏక మొత్తంగా ట్విటర్‌ను కొనేందుకు 43 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చి సంచలనం సృష్టించాడు. అలాంటి ఎలన్ మస్క్ తనకు స్వంత ఇళ్లు లేదంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫ్రెండ్స్ ఇళ్లలో టెడ్ ఇంటర్వ్యూలో మోడరేటర్ క్రిస్ అండర్సన్‌తో ఎలన్ మస్క్ మాట్లాడుతూ.. ఇప్పటికీ నాకు సొంత ఇళ్లు లేదు. నేను స్నేహితుల ఇళ్లలోనే ఉంటా. టెస్లా ఇంజనీరింగ్ పనులు ఎక్కువగా జరిగే బే ఏరియాకు తరుచుగా వెళ్తుంటా. అలా వెళ్లిన సందర్భాల్లో నా ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండే స్పేర్ బేడ్రూమ్లోనే ఉంటాను అంటూ చెప్పారు ఎలన్ మస్క్. విమానం ఉంది పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది సొంత లగ్జరీ యాచ్‌లను సమకూర్చుకుంటు ఉంటారు. కానీ నాకు అలాంటి యాచ్‌లు ఒక్కటి కూడా లేవు అసలు నా వ్యక్తిగత ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఖరీదైనది ఏదైనా ఉంది అంటే అది ప్లేన్ మాత్రమే. నాకంటూ సొంత విమానం లేకుంటే నేను పని చేసే సమయం కూడా చాలా తగ్గిపోయేది. విమానాల్లో వేగంగా ప్రయాణించడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. అది నేను మరింతగా పని చేసేందుకు ఉపయోగపడుతుందంటూ చెప్పాడు ఎలన్ మస్క్. విశేషమే చాలా మంది మిలియనీర్ దశలోనే సొంతంగా విల్లాలు కొనుకుంటారు. బిలియనీర్ క్లబ్లో చేరగానే యాచ్‌లు, దీవులను సొంతం చేసుకుని లగ్జరీ ఇళ్లులు నిర్మించుకుంటారు. కానీ ఎలన్ మస్క్ ఇందుకు విరుద్ధం. తన సంపద అంతా మళ్లీ ఏదో ప్రాజెక్టు మీద ఖర్చు చేయడం తప్పితే వ్యక్తిగత అంశాలకు కేటాయించకపోవడం విశేషం. గతంలో ఆయనకు పేరిట ఉన్న ఇళ్లను సైతం అమ్మేశారు. ఇకపై సొంత ఇళ్లు ఉంచుకోదలచుకోలేదు అని 2020 మేలో ప్రకటించారు. అన్నట్టుగానే రెండేళ్లలో ఆయన సంపద ఎంతో పెరిగినా మరో ఇళ్లు కొనలేదు. I am selling almost all physical possessions. Will own no house. — Elon Musk (@elonmusk) May 1, 2020 చదవండి: Elon Musk: నేను ట్విటర్ సొంతం చేసుకుంటే వాళ్లకు జీతం ఉండదు! -
వారం రోజుల్లో పెళ్లి.. ఇదేంటే.. అసలు విషయం తెలిసి
‘‘కావ్యా (పేరుమార్చడమైనది) ఒక్కసారి కళ్లు తెరువమ్మా! ఏమైందే. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడిలా చేశావ్, నీకీ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే సరిపోయేది కదా!’’ సుభద్రమ్మ ఏడుస్తునే ఉంది. ‘‘నువ్వు కాసేపు మౌనంగా ఉండు’’ అంటూ భర్త రాఘవరావు సుభద్ర మీద కేకలేశాడు. కాసేపటికి కావ్య లేచి తల్లిదండ్రులని చూసి, తలదించుకుంది. ‘‘ఏమైందమ్మా! కాస్త ఆలస్యమైతే ఎంత దారుణం జరిగేది. ఉరివేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది తల్లీ’’ అనునయంగా అడిగాడు రాఘరావు. ఆ మాటలతో కావ్య తండ్రిని పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోయింది. ‘‘నీకు ఇష్టమని చెప్పాకనే కదా, పెళ్లి పెట్టుకున్నది..’ సందేహంగా అడిగాడు కూతుర్ని. ‘‘నిజమే నాన్నా!’’ అంటూ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయిన కూతుర్ని చూసి, భయమేమీ లేదమ్మా ఇప్పటికైనా చెప్పు. ‘‘పెళ్లి ఆపేద్దామంటే వాళ్లకు చెప్పేస్తే. నీ చావు చూసే పెళ్లి వద్దమ్మా!’ అన్నాడు రాఘరావు. ‘‘అది కాదు నాన్న నేను ఎంతగానో నమ్మిన వంశీ (పేరుమార్చడమైనది) నన్ను టార్గెట్ చేశాడు’’ ఏడుస్తూనే చెప్పింది కావ్య. అర్థం కాక ‘‘వంశీ నీ బెస్ట్ ఫ్రెండ్ కదమ్మా, ఏమైంది’’ కంగారుగా అడిగాడు. కూతురు చెప్పిన విషయం వినడంతోనే రాఘవరావు కోపంతో ఉగిపోయాడు. ∙∙ కావ్య తన క్లాస్మేట్ వరుణ్(పేరు మార్చడమైనది)తో స్నేహంగా ఉండేది. బీటెక్ నాలుగేళ్లూ ఇద్దరూ చాలా క్లోజ్‌గా తిరిగారు. పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇద్దరూ ఒక అవగాహనతో తాము క్లోజ్‌గా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసుకున్నారు. రెండుమూడు నెలల వరకు ఎవరి పనుల్లో వారుండిపోయారు. ఓ రోజు ఫ్రెండ్ ఫోన్ చేసి, డేటింగ్ సైట్స్‌లో కావ్య వరుణ్ క్లోజ్‌గా ఉన్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని చెప్పింది. వాటిని కావ్య చూసింది. వరుణ్‌కి ఫోన్ చేసి తిట్టింది కావ్య. తనేమీ వాటిని షేర్ చేయలేదని రివర్స్ అయ్యాడు వరుణ్. ఈ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన వంశీకి చెప్పింది. ఎలాగైనా ఆ సైట్స్ నుంచి తన ఫొటోలు డిలీట్ చేయించమని వేడుకుంది. కావ్య చెప్పినట్టు వంశీ వాటిని వివిధ సైట్స్ నుంచి తొలగించేశాడు. ‘హమ్మయ్య’ అనుకుని వంశీకి ‘థాంక్స్’ చెప్పింది. ఆరు నెలల తర్వాత ఇంట్లో పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పింది. త్వరలో పెళ్లి అనుకున్నారు. భవిష్యత్తు సంతోషంగా ఉండబోతుందనుకున్న కావ్యకు పాత వీడియోలు, ఫొటోలు మళ్లీ వివిధ రకాల సైట్లలో అప్లోడ్ అయి ఉండటంతో షాకైంది. వంశీని అడిగితే పెళ్లికి ముందు తనతో గడిపితేనే, అవన్నీ తీసేస్తానని, లేదంటే సమాచారం అంతా పెళ్లికొడుక్కి చేరుతుందని బెదిరించడం మొదలుపెట్టాడు వంశీ. షాకైంది కావ్య. ‘సైట్స్ నుంచి తొలగించినట్టే తొలగించి, అవన్నీ దాచిపెట్టుకొని, పెళ్లి కుదిరే సమయానికి పాత వీడియోలను, ఫొటోలను అడ్డుపెట్టుకొని తన జీవితంతో ఆడుకుంటున్నాడ’ని అర్ధమైంది కావ్యకు. పెళ్లి ఆగిపోతుందని, పరువు పోతుందని భయపడి చావే శరణ్యం అనుకుంది. విషయమంతా తెలుసుకున్న రాఘరావు కూతురుని తీసుకొని పోలీసులను ఆశ్రయించాడు. కావ్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వంశీ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వ్యక్తిగత వివరాలు గోప్యం కొందరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. చాలాసార్లు సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలు తీస్తుంటారు. ఇద్దరి మధ్య సంబంధం చెడినప్పుడు వీటిని అడ్డుగా పెట్టుకొని ముఖ్యంగా అమ్మాయిలను రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వివిధ రకాల యాప్‌ల ద్వారా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పోర్న్సైట్లలో పెట్టడం ఎక్కువగా జరుగుతోంది. అందుకని ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండటం అవసరం. పరువు పోతుందని పొలీసులను సంప్రదించకుండా మూడోమనిషి సాయం తీసుకుంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందు కేసు ఫైల్ చేయాలి. వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. సమస్యకూ సత్వరమే పరిష్కారం అందుతుంది. సైబర్ క్రైమ్ సమస్యలకు htps://4s4u.appolice.gov.in/ ఫోన్ నెంబర్: 90716 66667 సంప్రదించవచ్చు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ బ్లాక్ చేయకూడదు.. బ్లాక్మెయిల్ చేస్తున్నారనగానే వెంటనే భయపడిపోతారు. వేధింపులు భరించలేక సదరు వ్యక్తి నెంబర్ బ్లాక్ చేస్తుంటారు. ఒకసారి వేధించాలనుకున్న వ్యక్తి రకరకాల మార్గాల ద్వారా బెదిరింపులకు దిగుతాడు. డబ్బులు ఇస్తామనో, మరో విధంగానో కాంప్రమైజ్ అవుతాను అనే ధోరణి నుంచి బయపడాలి. బ్లాక్మెయిల్ చేస్తున్నాడనగానే వారి డేటా, కాల్ రికార్డ్ చేసుకోవాలి. అన్ని మెసేజ్‌లను స్క్రీన్ షాట్స్ చేసి పెట్టుకోవాలి. వెంటనే http://www.cybercrime.gov.in/ నేషనల్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
పాక్ లేఖాస్త్రం.. మరో కుట్ర!
ఇస్లామాబాద్ : భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్థాన్ వేగంగా పావులు కదుపుతోంది. జైల్లో ఉన్న జాదవ్ ‘భారత గూఢాచారి’ అని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానం లభించిన క్లియరెన్స్‌తో భారత్ నుంచి జాదవ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘పట్టుబడే సమయంలో జాదవ్ భారత నేవీ అధికారిగా కొనసాగుతున్నారు’’ ఇది పాక్ బలంగా వినిపిస్తున్న ఆరోపణ. దీనిని నిరూపించేందుకు తగిన సమాచారం సేకరించేందుకు ఐసీజే నుంచి ప్రత్యేక అనుమతిని పొందింది. దీంతో తాజాగా పాక్ భారత విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘జాదవ్ వ్యక్తిగత విషయాలు, ఆయన ఉద్యోగంలో చేరిన తేదీ-విరమణ పొందిన తేదీ, పాస్‌పోర్ట్ వివరాలు, బ్యాంక్ అకౌంట్, పెన్షన్ తదితర అంశాలపై పూర్తి వివరాలను తమకు ఇవ్వాలి’’ అని పాక్ కోరింది. ఆ లెక్కన్న పట్టుబడిన సమయంలో జాదవ్ విధుల్లో ఉన్నాడా? లేదా? అన్నది ఈ రకంగా ధృవీకరించుకోవాలని పాక్ భావిస్తోంది. పాస్ పోర్టే కీలకం... మరీ ముఖ్యంగా పాస్ పోర్టు అంశంపైనే పాక్ ప్రధానంగా దృష్టిసారించినట్లు సమాచారం. హుస్సేన్ ముబాకర్ పటేల్ పేరు మీద ఉన్న పాస్పోర్టుతో జాదవ్ పుణే నుంచి ఇరాన్ కు ఆయన ప్రయాణించారనే పాక్ ఆరోపిస్తోంది. అంతేకాదు ముంబై, దుబాయ్ ఇలా 18 ప్రాంతాల్లో ఆయన ఇదే పాస్ పోర్టు మీద ప్రయాణించారంటోంది. అలాంటప్పుడు అది ఆయన ఒరిజినల్ పాస్‌పోర్టు అవునా? కాదా? అన్నది భారత్ నిర్ధారించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆస్తుల వివరాలను కూడా కోరినట్లు తెలుస్తోంది. ముంబై, పుణే, మహారాష్ట్రంలో హుస్సేన్ ముబారక్ పేరు మీద ఉన్న ఆస్తులు జాదవ్‌కు చెందినవేనని పాక్ అనుమానిస్తోంది. 13 మంది ఇండియన్ అధికారుల పేర్లను ఈ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా, ఓ ‘రా’ మాజీ అధికారి(వీరిద్దరే జాదవ్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నారని పాక్ ఆరోపణ), నిఘా, బ్యాంక్, పాస్‌పోర్టు అధికారులకు పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లేఖల వ్యవహారంపై విదేశాంగ శాఖ మాత్రం స్పందించటం లేదు. 2016 మార్చిలో బెలూచిస్తాన్ ప్రాంతంలో తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్ర కుట్రలు పన్నారన్న ఆరోపణలపై పాక్ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఆ సమయంలోనూ ఆయన విధుల్లో ఉన్నారంటూ పాక్ వాదిస్తూ వస్తోంది. కానీ, ఆయన పదవీ విరమణ పొందారని.. వ్యాపారం నిమిత్తం ఇరాన్ వెళ్లిన అతన్ని కిడ్నాప్ చేసి మరి పాక్ జైల్లో బంధీగా ఉంచారని భారత్ చెబుతోంది. జాదవ్‌పై మరో కేసు... అంతర్జాతీయ న్యాయస్థానం ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయటంతో మరో కుట్రకు పాక్ తెరలేపింది. జాదవ్‌పై మరో కేసును బనాయించింది. ఉగ్రవాదం, మోసం, విద్రోహ చర్యలు కింద జాదవ్‌పై తప్పుడు కేసులు బనాయించి దర్యాప్తు ప్రారంభించింది. -
షాకింగ్: 210 వెబ్సైట్లలో మన ఆధార్ డేటా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆధార్‌లోని వ్యక్తిగత సమాచారంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం సమాచార భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన విషయంల తెలిసిందే. తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు అధికార వర్గాలు ఇచ్చిన సమాధానం వ్యక్తిగత సమాచార గోప్యతపై పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్ని సైట్లు ఆధార్‌కార్డు వివరాలను ఉపయోగించుకుంటున్నాయనే ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 210 కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లుతోపాటు విద్యాసంస్థలు ఆధార్‌డేటాను అధికారికంగా ఉయోగించుకుంటున్నాయని ఆధార్ అధికారులు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు సైతం ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించుకుంటున్నాయి. వాటిలో ఆధార్‌కార్డు నెంబర్‌ను నమోదు చేయగానే కార్డు దారుని పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్లు, లావాదేవీల ఖాతాల వివరాలు కనిపిస్తున్నాయని కేంద్రం తెలిపింది. వినియోగదారుడి వ్యక్తిగత సమాచర భద్రత కోసం యూఐడీఏఐ పలు అంచెల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తుందని ఆధార్ వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు వాటి పనితీరును అధికారులు సమీక్షిస్తారని ముఖ్యంగా డేటా సెంటర్లను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తామని ఓ అధికారి తెలిపారు. డేటా భద్రత, గోప్యతను బలోపేతం చేయడానికి భద్రతా ఆడిట్లను క్రమ పద్ధతిలో నిర్వహిస్తామని, డేటా సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
వంద కోట్ల యాహూ ఖాతాల హ్యాకింగ్
• వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి • మూడు నెలల్లో రెండో ఉదంతం • వెరిజాన్‌తో యాహూ డీల్‌కు బ్రేక్!! వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ మెయిల్ అకౌంట్లు మరోసారి హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ సారి ఏకంగా వంద కోట్ల పైగా యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు చోరీ అయినట్లు కంపెనీ వెల్లడించింది. 2013ఆగస్టులో ఇది జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌లో దాదాపు 50 కోట్ల మంది యూజర్ల డేటా హ్యాకింగ్‌కు గురైనట్లు యాహూ వెల్లడించిన కొన్నాళ్లకే అటువంటిదే మరో ఉదంతం చోటుచేసుకోవడంగమనార్హం. గతంలో జరిగిన హ్యాకింగ్ సంఘటనపై విచారణ జరుపుతుండగా.. 2013 నాటి హ్యాకింగ్ విషయం బయటపడినట్లు యాహూ తెలిపింది. ’2013 ఆగస్టులో వంద కోట్ల పైగా యూజర్ ఖాతాల డేటానుఅనధికారిక థర్డ్ పార్టీ చోరీ చేసినట్లు భావిస్తున్నాం’ అంటూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. నకిలీ కుకీలు ఉపయోగించడం ద్వారా హ్యాకర్లు ఈ ఖాతాల వివరాలు చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపింది.ఈ వివరాలు దుర్వినియోగమైన దాఖలాలేమీ ఇంకా తెలియలేదని పేర్కొంది. ఇప్పటికే తీవ్ర పోటీతో సతమతమవుతున్న యాహూకి ఈ పరిణామం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టనుంది. వెరిజాన్ సంస్థకు ప్రధానఅసెట్స్ను 4.8 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు ఉద్దేశించిన డీల్ కూడా ప్రశ్నార్ధకంగా మారనుంది. హ్యాకింగ్‌పై యాహూ విచారణ జరుపుతున్న నేపథ్యంలో పరిస్థితులను పరిశీలిస్తున్నామని వెరిజాన్ పేర్కొంది.అకౌంట్ల భద్రతకు మరిన్ని చర్యలు..యూజర్ల ఖాతాలను మరింత సురక్షితం చేసేందుకు చర్యలు తీసుకున్నామని కంపెనీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. గత హ్యాకింగ్ వెనుకున్న ఒక దేశ ప్రభుత్వ అండ గల హ్యాకర్లే ఈడేటా చౌర్యానికీ పాల్పడి ఉంటారని యాహూ పేర్కొంది. చోరీ అయిన వివరాల్లో యూజర్ల పేర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, టెలిఫోన్ నంబర్లు, పుట్టిన తేదీలు, కొన్ని పాస్వర్డ్లు, వీటితో పాటు అకౌంటు భద్రతాపరమైనప్రశ్నలు.. సమాధానాలు మొదలైనవి ఉండొచ్చని తెలిపింది. అయితే పేమెంట్ కార్డులు లేదా బ్యాంకు ఖాతాల పాస్వర్డ్లు మొదలైనవి హ్యాకర్లకు చిక్కి ఉండకపోవచ్చని వివరించింది. మరోవైపు, యాహూ ఉపయోగించేటెక్నాలజీ వ్యవస్థలో లోపాలను ఈ ఉదంతాలు ఎత్తిచూపుతున్నాయని ఇంటెల్ సెక్యూరిటీ సంస్థ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ స్టీవ్ గ్రాబ్మాన్ వ్యాఖ్యానించారు. భారీ ఎత్తున యూజర్ల డేటా చేతుల్లో ఉన్న పెద్ద సంస్థలు ఈతరహా దాడులను ఎదుర్కొనేందుకు కేవలం టెక్నాలజీపైనే ఆధారపడకుండా.. అంతర్గత, స్వతంత్ర వనరులను సమర్ధంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. -
స్టేట్మెంట్తో సగం పని అయినట్లే!
గత వారం రిటర్న్ ఎలా దాఖలు చేయాలో నేర్చుకున్నాం. రిటర్న్ దాఖలు చేయడానికి ముందు ఆదాయ వివరాలకి సంబంధించి స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వారం తెలుసుకుందాం. అసెస్సీకి వచ్చే ఆదాయం ఏ రూపంలో ఉన్నా దానికి సంబంధించిన వివరాలనిస్తూ దానికి సరిపడిన ఐటీఆర్ ఫారంతో రిటర్న్ దాఖలు చేస్తాం. దానికంటే ముందు అసెస్సీ ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ తరువాత రిటర్న్ దాఖలు చేయడం చాలా సులువవుతుంది. స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం: అసెస్సీ తన ఆదాయ వివరాలతో సహా వ్యక్తిగత వివరాలు కూడా పొందుపరచి స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. అంటే అసెస్సీ పూర్తి పేరు, తండ్రి పేరు, చిరునామా, ఫోను నంబరు, ఆధార్ నంబరు, ఇన్‌కంట్యాక్స్ రేంజ్/వార్డ్ నంబరు, పుట్టిన తేదీ, పాన్ నంబరు, ట్యాక్స్ స్టేటస్, రెసిడె న్షియల్ స్టేటస్, ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ సంవత్సరం, అసెస్సీకి సరిపడే ఐటీఆర్ ఫారం నంబరు, ఈ మెయిల్ ఇలాంటి వివరాలతో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం వల్ల అనేక లాభాలుంటాయి. ముందుగా అసెస్సీ ఐటీఆర్ ఫారంలో నింపే వివరాలన్నింటినీ కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేసుకోవడం వల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫైలింగ్ చేయడం సాధ్యపడుతుంది. అంతేకాకుండా అసెస్సీ ఆదాయానికి సంబంధించి ఎంత మేరకు పన్ను కట్టవలసి వస్తుందో లేక అసెస్సీకి ఏమైనా రిఫండ్ రూపంలో వస్తుందో ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుంది. దాన్ని బట్టి అసెస్సీ పన్ను వివరాలు, ఆదాయ వివరాలు సరి చేసుకునే వీలుంటుంది. అసెస్సీకి ఎన్ని రకాలుగా ఆదాయమున్నా సరే స్టేట్మెంట్లో వివరంగా పొందుపరచుకోవచ్చు. ఫైలింగ్ చేయడానికంటే ముందుగానే వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ వివరాలతో పాటు టీడీ ఎస్ వివరాలు కూడా పొందుపరచుకోవచ్చు. ట్యాక్సేషన్ నిపుణులు - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి - కె.వి.ఎన్. లావణ్య -
యాపిల్ స్టోర్ కి చైనా ఝలక్!
హుందాకు ప్రతీకగా భావించే ఐ- ఫోన్లను తయారు చేసే యాపిల్ సంస్థకు.. చైనా మొబైల్ అడ్వర్టైజింగ్ కంపెనీ ఝలక్ ఇచ్చింది. యాపిల్ స్టోర్ లో అందుబాటులో ఉన్న యాప్స్ ను ఉపయోగించి.. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. దీంతో యాపిల్ కంపెనీ.. తన స్టోర్స్ నుంచి భారీ స్థాయిలో యాప్స్ తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది. యాపిల్ హాండ్ సెట్ లో రహస్యంగా అమర్చిన కిట్ ద్వారా.. చైనాకు చెందిన మొబైల్ అడ్వర్టైజింగ్ ప్రొవైడర్ యూమీ యూజర్ ఐడీలు, మెయిల్ అడ్రస్ లు, డివైజ్ ఐడీలు, సర్వర్ కంపెనీ నుంచి ఇంటర్నెట్ రూట్ అయిన డేటా వంటి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తాము గుర్తించామని యాపిల్ వర్గాలు వివరించాయి. దీంతో యాపిల్ స్టోర్ లోని 250కి పైగా ఎస్డీకే యాప్ లను తొలగించారు. దీంతో పాటు భవిష్యత్ లో కూడా ఎస్డీకే అప్లికేషన్లను అనుమతించబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది. తొలగించిన అప్లికేషన్స్ స్థానంలో అతి త్వరలో అప్ డేటెడ్ వెర్షన్స్ ను అందించేందుకు తమ సిబ్బంది పనిచేస్తున్నారని.. వీటిని త్వరలోనే రీప్లేస్ చేస్తామని ప్రకటించింది. తమ స్టోర్ నుంచి అనధికారికంగా.. డేటాను వాడుకోవడం.. యూజర్ల వ్యక్తిగత వివరాలు సేకరించడం.. చట్టరీత్యా నేరమని.. ఇది కంపెనీ లీగల్, ప్రైవసీ ఒప్పందాలను ఉల్లంఘించడమే అని యాపిల్ స్పష్టం చేసింది. త్వరలోనే చైనా కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యోచిస్తున్నామని తెలిపింది.