సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆధార్‌లోని వ్యక్తిగత సమాచారంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం సమాచార భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన విషయంల తెలిసిందే. తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు అధికార వర్గాలు ఇచ్చిన సమాధానం వ్యక్తిగత సమాచార గోప్యతపై పలు అనుమానాలకు తావిస్తోంది.
సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్ని సైట్లు ఆధార్‌కార్డు వివరాలను ఉపయోగించుకుంటున్నాయనే ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 210 కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లుతోపాటు విద్యాసంస్థలు ఆధార్‌డేటాను అధికారికంగా ఉయోగించుకుంటున్నాయని ఆధార్ అధికారులు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు సైతం ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించుకుంటున్నాయి. వాటిలో ఆధార్‌కార్డు నెంబర్‌ను నమోదు చేయగానే కార్డు దారుని పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్లు, లావాదేవీల ఖాతాల వివరాలు కనిపిస్తున్నాయని కేంద్రం తెలిపింది.
వినియోగదారుడి వ్యక్తిగత సమాచర భద్రత కోసం యూఐడీఏఐ పలు అంచెల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తుందని ఆధార్ వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు వాటి పనితీరును అధికారులు సమీక్షిస్తారని ముఖ్యంగా డేటా సెంటర్లను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తామని ఓ అధికారి తెలిపారు. డేటా భద్రత, గోప్యతను బలోపేతం చేయడానికి భద్రతా ఆడిట్లను క్రమ పద్ధతిలో నిర్వహిస్తామని, డేటా సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment