
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు శుభవార్త! మీ పీఎఫ్ ఖాతాలో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు..వంటి కీలక వివరాలు తప్పుగా ఉన్నాయా? అయితే ఇకపై వాటిని సవరించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనికోసం జాయింట్ డిక్లరేషన్‌ను మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు.
ఏమిటీ జాయింట్ డిక్లరేషన్..
ఈపీఎఫ్ చందాదారులు తమ వ్యక్తిగత వివరాలు మార్చాలనుకుంటే జాయింట్ డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రిలేషన్, వైవాహిక స్థితి, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, రీజన్ ఫర్ లీవింగ్, నేషనాలిటీ, ఆధార్ నంబర్.. వంటి 11 రకాల వివరాలు ఇందులో మార్చుకోవచ్చు. అయితే ఈ వివరాలను మార్చాలంటే చందాదారుడు, సంస్థ యజమాని ఇద్దరూ ఈ మార్పును ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌నే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డిక్లరేషన్ ఫారాన్ని పీఎఫ్ కమిషనర్‌కి పంపించాలి. దాని అనుసరించి చందాదారుల వివరాలు అప్‌డేట్ అవుతాయి.
సవరణ ఇలా..
చందాదారులు ఈపీఎఫ్‌ఓ అధికారిక పోర్టల్ epfindia.gov.inకు వెళ్లాలి.
హోం పేజీ టాప్‌లో ఎడమవైపు servicesపై క్లిక్ చేయాలి.
For Employees అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
కిందకు స్క్రోల్ చేసి సర్వీసెస్ సెక్షన్‌లో Member UAN/ online Service(OCS/OTCP)పై క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్‌వర్డ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
స్క్రీన్‌పై కనిపించే Manage ఆప్షన్‌ను ఎంచుకోగానే అందులో joint declaration ఆప్షన్ కనిపిస్తుంది.
ఇదీ చదవండి: బ్యాంకులను హెచ్చరించిన ఆర్‌బీఐ గవర్నర్!
మీ మెంబర్ ఐడీని ఎంటర్ చేసి అప్‌డేట్ చేయాలనుకుంటున్న వివరాలను తెలపాలి. సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వివరాలు సబ్మిట్ చేశాక యజమానికి (ఎంప్లాయర్) లాగిన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు కూడా వెళ్తాయి.
ఎంప్లాయర్ కూడా ఆయా వివరాలను ధ్రువీకరించిన తర్వాత సదరు జాయింట్ డిక్లరేషన్‌ను పీఎఫ్ కమిషనర్‌కు పంపించాలి.
Comments
Please login to add a commentAdd a comment