న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందనుకునే లోపే ఒమిక్రాన్ రూపంలో మళ్లీ దాడి మొదలైంది. గత కొన్ని రోజులుగా కనీవినీ ఎరుగని స్థాయిలో రోజువారీ కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. అయితే ఒమిక్రాన్ చిన్నారులను కూడా విడిచిపెట్టడం లేదు. ఈ వేవ్‌లో చిన్నారులు ఎక్కువ ప్రభావితులు అవుతారని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల విషయంలో ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం!
కరోనా వ్యాప్తికి సంకేతంగా నిలిచే ఆర్ నాట్ విలువ 10కంటే ఎక్కువ రేట్లతో వచ్చే ఒమిక్రాన్ పిల్లలలో కనిపించే అత్యంత అంటు వ్యాధి అని ఎయిమ్స్ వైద్యుడు రాకేష్ లోధా తెలిపారు. మొదటి రెండు వేవ్‌లలో పిల్లల జోలికి ఎక్కువ రాకపోయినా ఒమిక్రాన్ ద్వారా వచ్చే యూడో వేవ్‌లో మాత్రం చాలా మంది చిన్నారులు, నెలల పిల్లలు కూడా వైరస్ బారిన పడే అవకాశాలున్నాయన్నారు. అయితే అందులో చాలా మందికి లక్షణాలు లేకున్నా పాజిటివ్ రాగా.. మరి కొంత మందికి స్వల్ప లక్షణాలు కనిపించాయి.
చదవండి: చుట్టేస్తోంది.. జాగ్రత్త: ప్రధాని మోదీ
పిల్లలపై కోవిడ్ ప్రభావంపై ఎయిమ్స్ నిర్వహించిన సెమినార్‌లో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ లోధా మాట్లాడుతూ.. పిల్లలు వైరస్‌కు ప్రభావితం కావడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. దీనికి మొదటి కారణం ఒమిక్రాన్ అని తెలిపారు. అంతేగాక పిల్లలపై జాగ్రత్తలు తగ్గించడం, అన్ని ప్రాంతాలు పూర్తిగా అన్‌లాక్ అవ్వడం, సామూహికంగా సమావేశమడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్‌లు దధరించకపోడం వైరస్ వ్యాప్తికి మూల కారణమని తెలిపారు. అయితేవ్యాధి బారిన పడే పిల్లల సంఖ్య గణనీయంగా పెరగలేదని, కేసుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా కొద్దికొద్దిగా పెరిగాయని డాక్టర్ లోధా చెప్పారు.
చదవండి: వైరల్ వీడియో: ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఏడ్చేసిన బీఎస్పీ నాయకుడు
అమెరికాలోని ఆసుపత్రుల నుంచి వచ్చిన కొన్ని నివేదికలతో ప్రస్తుత వేవ్‌లో పిల్లలలో అనారోగ్యం తీవ్రత గురించి ఆందోళన పెరిగింది. ఆసుపత్రిలో చేరుతున్న పిల్లల సంఖ్య పెరిగినట్లు చూస్తున్నారని ఎయిమ్స్, న్యూఢిల్లీ, డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు.
పిల్లలలో కోవిడ్-19 లక్షణాలు
► తేలికపాటి లక్షణాలు: జ్వరం, గొంతు నొప్పి, రైనోరియా, దగ్గు.
చికిత్స: హోమ్ ఐసోలేషన్, పారాసెటమాల్ 10-15mg/kg/డోస్, ప్రతి 4-6 గంటలకు ఒకసారి వేసుకోవచ్చు. పెద్ద పిల్లలలో వెచ్చని సెలైన్ గార్గిల్స్, తగినంత పోషకాహారం తీసుకోవడం. ఎక్కువగా నీరు తాగడం. దగ్గును తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, మోల్నుపిరవిర్, ఫ్లూవోక్సమైన్, సోర్ట్రోవిమాబ్ మొదలైనవి తీసుకోరాదు.
ప్రమాద సంకేతాలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం రంగు మారడం, ఛాతీ నొప్పి, కొత్త గందరగోళం, ఏదైనా ద్రవాలను తాగడం లేదా ఉంచలేకపోవడం, మేల్కొని ఉన్నప్పుడు స్పందించకపోవడం
మితమైన లక్షణాలు: వేగంగా శ్వాస తీసుకోవడం, ఆక్సిజన్ స్థాయి 90 నుంచి 94% మధ్య.ఉండటం
చికిత్స: కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిలో చేరడం.
Comments
Please login to add a commentAdd a comment