సెబీలో గ్రేడ్‌ ఏ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. త్వరపడండి! | SEBI Recruitment 2022: Vacancies, Eligibility, Salary Details Here | Sakshi
Sakshi News home page

సెబీలో గ్రేడ్‌ ఏ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. త్వరపడండి!

Jan 11 2022 2:53 PM | Updated on Jan 11 2022 3:06 PM

SEBI Recruitment 2022: Vacancies, Eligibility, Salary Details Here - Sakshi

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ).. వివిధ విభాగాల్లో ఆఫీసర్‌ గ్రేడ్‌ ఏ(అసిస్టెంట్‌ మేనేజర్లు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 120

► పోస్టుల వివరాలు: జనరల్‌–80, లీగల్‌–16, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ)–14, రీసెర్చ్‌–07, అఫీషియల్‌ లాంగ్వేజ్‌–03.

► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

► వయసు: 31.12.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.

► ఎంపిక విధానం: మూడు దశల్లో జరుగుతుంది. మొదటిగా ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ఫేజ్‌ 1 స్క్రీనింగ్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫేజ్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఫేజ్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. దీనిలో ప్రతి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. ఫేజ్‌ 2లో సాధించిన స్కోర్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.01.2022
► వెబ్‌సైట్‌: sebi.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement