పాఠాలు చెప్పేదెవరు? | who is saying lessons? | Sakshi
Sakshi News home page

పాఠాలు చెప్పేదెవరు?

Published Mon, Jul 21 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

పాఠాలు చెప్పేదెవరు?

పాఠాలు చెప్పేదెవరు?

అచ్చంపేట: జిల్లాలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో కూనరిల్లుతున్నాయి. నాలుగేళ్లుగా పోస్టులు భర్తీకాకపోవడం.. పాఠాలు చెప్పేవారు లేకపోవడంతో విద్యార్థులు బడికి రావడం మానేస్తున్నారు. చెంచుగిరిజనుల్లో విద్యాప్రమాణాలను పెంచడంతో పాటు పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలను గిరిజన సంక్షేమశాఖ(డీటీడబ్ల్యూఓ) ఆధీనంలోకి చేర్చింది.
 
 వీటిలో ఇప్పటివరకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించకపోగా.. ఎస్‌జీటీ తోనే నెట్టుకొస్తున్నారు. సమస్యను అధిగమించేందుకు గతేడాది ప్రభుత్వం 2825 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చినా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. ఇదిలాఉండగా, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు మంజూరు చేసిన ఉద్యోగాల ను నేరుగా గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించకుండా రాజీవ్ విద్యామిషన్(ఆర్‌వీఎం) కిందకు చేర్చింది. దీం తో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే పోస్టుల కోటాలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతోఅడుగు ముందుకు పడటం లేదు. జిల్లాలోగిరిజన సంక్షేమశాఖ పరిధిలో 16 ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి(బాలికలు), వటువర్లపల్లిలో రెండుఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
 
  అచ్చంపేట మండ లం సిద్దాపూర్, కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి పాఠశాలలు పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ అయి మూడే ళ్లు అవుతున్నా ఇంతవరకు అక్కడ పోస్టులు భర్తీకాలేదు. ఉపాధ్యాయులు లేని కారణంగా 8వ తరగతి వరకే తరగతులు కొనసాగుతున్నాయి. బల్మూర్ మండలం బాణా ల, చెంచుగూడెం, లింగాల మండలం అప్పాయిపల్లి, రా యవరం, అప్పాపూర్, అమ్రాబాద్ మండలం ఉడిమిళ్ల, కొల్లాపూర్ మండలం పెద్దూటి, అచ్చంపేట, బొంరాస్‌పేట, కల్వకుర్తి, మైసిగండి, ఖిల్లాఘన్‌పూర్ మండలాల పరిధిలోని గిరిజన ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,508 మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు.
 
 భర్తీకాని పోస్టులు
 అచ్చంపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో మొత్తం 8 ఉపాధ్యాయ పోస్టులుకు ఒకరు రెగ్యులర్, ఒకరు ఇన్‌చార్జి (ని ర్వహకురాలు) మాత్రమే ఉన్నారు. 3 నుంచి 9వ తరగ తి వరకు 323 విద్యార్థులు ఉండగా..ప్రతీ తరగతిలో రెం డు సెక్షన్లు ఉన్నాయి. ముగ్గురు సీఆర్‌టీ(కాంట్రాక్టు రిసో ర్స్ టీచర్)లతో పాటు ఐదుగురు విద్యావలంటీర్ల ద్వా రా పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడ సీఆర్‌టీలకు మాత్ర మే జీతాలు వస్తున్నాయి. వలంటీర్లకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో135ఉపాధ్యాయపోస్టులకు67ఖాళీలు ఉన్నా యి.
 
 కొన్ని ఆశ్రమ పాఠశాలలో సీఆర్‌టీలను ఎంపికచేసి విద్యాబోధన చేయిస్తున్నారు. పట్టణ ప్రాంతంలోని ఆశ్ర మ పాఠశాలలో పనిచేసేందుకు సీఆర్‌టీలు ముందుకు వస్తున్నారే తప్ప అటవీప్రాంతంలోని పాఠశాలలో చేరేం దుకు చొరవ చూపడం లేదు. ఆశ్రమ పాఠశాలలో పనిచే సే వర్కర్లకురూ.7200జీతం చెల్లిస్తున్న ప్రభుత్వం సీఆర్ టీలకు మాత్రం రూ.4,500 ఇస్తుంది. దీంతో విద్యాబోధన చేసేందుకు ఎవరూముందుకు రాకపోవడంతో ఆశ్ర మ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. కొత్త ప్రభుత్వమైన ఉపాధ్యాయులను నియమించి చదువులు చెప్పించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement