హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల లెక్క తేల్చాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు, వివిధ విభాగాధిపతులతో సోమవారం ఆయన శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు.
పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన అంశాలు, త్వరలో జరుగబోయే వార్షిక పరీక్షల ఏర్పాట్లపైన సమీక్షించారు. జిల్లాల్లో మోడల్ స్కూళ్లు, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.