అంతా ఖాళీ! | SC Welfare Department vacancies | Sakshi
Sakshi News home page

అంతా ఖాళీ!

Published Tue, Jun 28 2016 4:23 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

అంతా ఖాళీ!

అంతా ఖాళీ!

డీడీతోపాటు ఏఎస్‌డబ్ల్యూఓ పోస్టులు ఖాళీ
వార్డెన్‌లే ఇన్‌చార్జీలు హాస్టళ్లను పర్యవేక్షణ చేసే నాథుడే లేడు
పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టని ప్రభుత్వం
కుంటుపడుతున్న ఎస్సీ సంక్షేమ శాఖ

 ఇందూరు :  ఒకప్పుడు అధికారులు, సిబ్బందితో కళకళలాడిన జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ప్రస్తుతం ఖాళీలతో వెక్కిరిస్తోంది. వసతిగృహాల పర్యవేక్షణ, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన(డీఎస్‌డబ్ల్యూఓ) డివిజన్ స్థాయి సహాయ సంక్షేమాధికారుల పోస్టుల్లో పని చేసిన వారందరూ క్రమక్రమంగా పదవీ విరమణ పొందడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో ఏళ్ల తరబడి వార్డెన్స్ ఇన్‌చార్జీ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జిల్లా అధికారి డిప్యూటీ డెరైక్టర్ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ప్రస్తుతం వసతిగృహాలు ప్రారంభమయ్యాయి. వీటిని పర్యవేక్షణ చేసే నాథులే లేక  వసతిగృహాలు, వార్డెన్‌ల పనితీరు  అస్తవ్యస్తంగా మారింది.

ఇదీ పరిస్థితి...
జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 67 వసతి గృహాలు ఉన్నాయి. ఇందుకు సరిపడా వార్డెన్‌లు ఉన్నారు. అయితే  ఈ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సౌకర్యాల కల్ప న, మెనూ ప్రకారం భోజన వసతి సక్రమంగా కల్పించాల్సిన బాధ్యత వార్డెన్‌లపై ఉంది. కానీ.. వార్డెన్‌లు సక్రమంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో వసతిగృహాల పర్యవేక్షణకు డివిజన్‌లవారీగా ఐదు స హాయ సంక్షేమాధికారుల పోస్టులను మంజూరు చేసి పోస్టులను భర్తీ చేశారు. వార్డెన్‌లు వీరి ఆధీనంలో పని చేయాలి. కానీ.. ప్రస్తుతం ఐదు పోస్టుల్లో కేవలం నిజామాబాద్ డివిజ న్‌కు చెందిన ఒక్కరు మాత్రమే సహాయ సంక్షేమాధికారిగా పని చేస్తున్నారు.

బోధన్ డివిజన్ భూమయ్య, కామారెడ్డి డివిజన్ ఆల్ఫోన్సా, మద్నూరు డివిజన్ వెంకట్రాంలు, ఆ ర్మూర్ డివిజన్ రాంకిషన్‌లు గడిచిన కాలంలో పదవీ విరమ ణ పొందారు. వీరి స్థానాల్లో ప్రభుత్వం రెగ్యులర్ అధికారుల ను నియమించాలి. ప్రాధాన్యత కలిగిన ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో సంబంధిత డివిజన్‌లోని సీనియర్, గ్రేడ్-1 వార్డెన్‌లకు సహాయ సంక్షేమాధికారులుగా ఇన్‌చార్జీ బా ధ్యతలు అప్పగించారు. వార్డెన్‌లు తమ సొంత ఉద్యోగంతోపాటు అదనపు బాధ్యతలు చేపట్టడం కష్టంగానే మారింది. స్థానికంగా వసతిగృహంలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వా రా చేపడుతున్న నేపథ్యంలో వారి వేలి ముద్రలు సమయానికి తీసుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉండగా ఇదే శాఖలో ప్ర ధానంగా జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి (డీఎస్‌డబ్ల్యూఓ) పో స్టు మూడేళ్లకు పైగా ఖాళీ ఉంది. ఇందుకు నిజామాబాద్ ఏఎస్‌డబ్ల్యూఓ జగదీశ్వర్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. వసతిగృహాల పర్యవేక్షణే కాకుండా ప్రస్తుతం కళ్యా ణ లక్ష్మి పథకాన్ని ఎస్సీ సంక్షేమ శాఖకు జోడించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలు బాధ్యతలను వార్డెన్‌లు, సహా య సంక్షేమాధికారుపై పెట్టారు. లబ్ధిదారుల వెరిఫికేషన్ చే యడంలో కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా ఎస్సీ సంక్షేమ శాఖలో ఉద్యోగుల లేమితో, ఇన్‌చార్జీల పాలనతో చతికిల పడింది.

 శాఖకు బాసే లేడు..
జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖకు జిల్లా అధికారిగా డిప్యూటీ డెరైక్ట ర్ (డీడీ) పోస్టు ఉంది. ఈ శాఖకు ఈ పోస్టే కీలకం. సహాయ సంక్షేమాధికారులు, వార్డెన్‌లు, శాఖలోని ఉద్యోగుల పరిపాలన, వసతిగృహాలు ఇలా మొత్తం శాఖకు ఆయనే బాస్‌గా వ్యవహరించాలి. కానీ ఈ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. రెం డు నెలల క్రితం పని చేసిన డీడీ విజయ్ కుమార్‌ను పనితీరు బాగోలేదని కలెక్టర్ ఆయనను రాష్ట్ర శాఖకు సరెండర్ చేశారు. ఖాళీ అయిన స్థానంలో డీసీఓ గంగాధర్ ఇన్‌చార్జిగా పని చేశారు. ఇన్‌చార్జి బాధ్యతలను మళ్లీ ఏజేసీ రాజారాంకు అప్పటించారు. ప్రస్తుతం ఆయనే కొనసాగుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం...
ఎస్సీ సంక్షేమ శాఖలో ప్రధానంగా సహాయ సంక్షేమాధికారుల పోస్టులు ఖాళీగా మారాయి. ఐదు పోస్టులకు ఒక్కరే పని చేస్తున్నారు. మిగతా వాటికి ఇన్‌చార్జీలుగా వార్డెన్‌లకు బాధ్యతలు అప్పగించాం. ఇటు డీఎస్‌డబ్ల్యూఓ పోస్టు కూడా మూడేళ్లకు పైగా ఖాళీ ఉంది. అయితే ఇన్‌చార్జీల పాలనతో పాలను ముందుకు సాగడం లేదు. ఇబ్బందికరంగా మారింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పోస్టులను భర్తీ చేయాలని కోరాం. - జగదీశ్వర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఎస్‌డబ్ల్యూవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement